ఆ దేశ ప్ర‌జ‌లంద‌రూ రోజుకు 2 సార్లు… 2 నిమిషాల పాటు ఎక్క‌డివారు అక్క‌డే నిల‌బ‌డి మౌనంగా ఉండిపోతారు.! ఎందుకో తెలుసా?

ఒక్కో దేశంలో ఒక్కో నియ‌మాలుంటాయి . కొన్ని దేశాల్లో క‌ఠిన‌మైనవుంటే మ‌రికొన్ని దేశాల్లో న‌వ్వును తెప్పించేవిగా ఉంటాయి, మ‌రికొన్ని దేశాల్లో గౌర‌వాన్ని పెంచేవిగా ఉంటాయి. కానీ థాయిలాండ్ లో ఉన్న 7 నియ‌మాల‌ను చూస్తే పై మూడు అంశాలు మిక్స్ చేసిన‌ట్టు అనిపిస్తాయి.. ఇంత‌కీ ఆశ్చ‌ర్యాన్ని గొలిపే ఆ 7 నియ‌మాలేంటో ఓసారి చూద్దాం.!

  • థాయ్ లాండ్ లో అండ‌ర్ వేర్ లేకుండా బ‌య‌ట తిర‌గ‌డం నేరం.! #అండ‌ర్ వేర్ లేకుంటే యువ‌రండ‌ర్ అరెస్టే.!!

  • థాయ్ వారికి థ‌ర్డ్ జెండ‌ర్ వారి మీద అపార గౌరవం ఉంటుంది. అంద‌కే మేల్ ఫీమేల్ తో పాటు థ‌ర్డ్ జెండ‌ర్ వారికి కూడా సెప‌రేట్ వాష్ రూమ్స్ ఉంటాయి….వాటినే పింక్ టాయిలెట్స్ అంటారు.

  • ష‌ర్ట్ లేకుండా కార్ న‌డ‌ప‌డం అక్క‌డ నేరంగా ప‌రిగ‌ణిస్తారు.

  • ఆ దేశ క‌రెన్సీ మీద కాలుపెట్ట‌డం కూడా నేర‌మే.!

  • మ‌న ద‌గ్గ‌ర మంగ‌ళ‌వారం క‌టింగ్ షాప్స్ బంద్ అయితే ..అక్క‌డ మాత్రం బుధ‌వారం.

  • మ‌న‌కు రాబోయేది 2017 అయితే …వారికి మాత్రం 2561

  • అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది వారి జాతీయ‌గీతం ప‌ట్ల వారికున్న అపార గౌర‌వం. ..ఆ దేశంలో ఉద‌యం 8 గంట‌ల‌కొక‌సారి.., సాయంత్రం 6 కు ఓసారి వారి జాతీయ గీతం లౌడ్ స్పీక‌ర్స్ లో ప్లే అవుతుంది. ఈ స‌మ‌యంలో ఎవ‌రు ఎక్క‌డున్నా…క‌ద‌ల‌కుండా అలాగే నిల‌బ‌డి జాతీయ గీతాన్ని గౌర‌విస్తారు. ఈ రెండు స‌మ‌యాల్లో దాదాపు 2 నిమిషాల పాటు థాయ్ లాండ్ మొత్తం మౌనంగా ఉండిపోతుంది.

Comments

comments

Share this post

scroll to top