జన్మనక్షత్రం, రాశిని బట్టి…ఏ మొక్కను నాటాలి? ఇదిగో లిస్ట్.

తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతుంది. భావితరాలకు స్వఛ్చమైన ప్రాణవాయువును, పుష్కల వర్షాలను అందించేందుకు ప్రారంభమైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. దానికి తోడు….. మన నమ్మకాలను కూడా ఈ కార్యక్రమానికి జోడించడంతో…మొక్కలు నాటే ప్రక్రియ ఓ పుణ్యకార్యంగా కొనసాగుతుంది.  నిజమే మన పురాణాల ప్రకారం జన్మ నక్షత్రాన్ని బట్టి, పుట్టిన రాశిని బట్టి…దానికి తగ్గ మొక్కను నాటితే…మనకు మేలు జరిగే అవకాశం అధికమట.!  అయితే మనలో ఓ డౌట్ ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఏ మొక్కను నాటితే ప్రయోజనకరమని.? అందుకోసం….కింది లిస్ట్ ను ఫాలో అవ్వండి. వెంటనే మీ నక్షత్రం, రాశిని బట్టి రెండు మొక్కలు నాటి…వాటి సంరక్షణ చేపట్టండి.  వృక్షో రక్షితి రక్షిత:

list2

 

రాశులను బట్టి నాటాల్సిన మొక్కలు:

 1. మేషం – ఎర్ర చందనం (రక్త చందనం)
 2. వృషభం – ఏడాకుల పాయ (సప్తపర్ణి)
 3. మిధునం – పనస (పనస)
 4. కర్కాటకం – మోదుగ (పలాస)
 5. సింహం – కలిగుట్టు (పాటలి)
 6. కన్య – మామిడి, చూత (ఆమ్ర, మకండ)
 7. తుల – పొగడ (బకుళ)
 8. వృశ్చిక – సండ్ర (ఖధిర)
 9. ధనుస్సు – రావి (అశ్వద్ధ)
 10. మకరం – జిట్టేగి (శింశుపా)
 11. కుంభం – జమ్మి (శమి)
 12. మీనం – మర్రి (వట)

tree

నక్షత్రాన్ని బట్టి నాటాల్సిన మొక్కలు:

 1. అశ్విని – ముష్టి (కరస్కర)
 2. భరణి – ఉసిరి (అమలక)
 3. కృత్తిక – మేడి, అత్తి (ఉదుంబర)
 4. రోహిణి – నేరేడు (జంబు)
 5. మృగశిర – సండ్ర (ఖదిర)
 6. ఆర్ద్ర – గుమ్మడి టేకు (కృష్ణ)
 7. పునర్వసు – వెదురు (వంశి)
 8. పుష్యమి – రావి (అశ్వథ్థ)
 9. ఆశ్లేష – నాగకేసరి (నాగ)
 10. మఖ – మర్రి (వట)
 11. పుబ్బ – మోదుగ (పలాస)
 12. ఉత్తర – బండజువ్వి(ప్లక్ష)
 13. హస్త – అడవి మామిడి (అంబిస్థ)
 14. చిత్త – మారేడు (బిల్వం)
 15. స్వాతి – తెల్లమద్ది (అర్జున)
 16. విశాఖ – పులివెలగ (వికంకట)
 17. అనూరాధ – పొగడ (బకుళ)
 18. జ్యేష్ట – తెల్లలొద్దుగ (లొద్ర)
 19. మూల – మండదుంప (సర్జు)
 20. పూర్వాషాడ – కనప (వంజుల)
 21. ఉత్తరాషాఢ – పనస (పనస)
 22. శ్రవణ – జిల్లేడు (అర్క)
 23. ధనిష్ట – జమ్మి(శమి)
 24. శతభిషం – కదంబం (కదంబ)
 25. పూర్వాభద్ర – మామిడి, చూత (ఆమ్ర, మకండ)
 26. ఉత్తరాభద్ర – వేప (నింబ)
 27. రేవతి – పెద్ద ఇప్ప (మధుక)

Comments

comments

Share this post

scroll to top