ధ‌నా ధ‌న్..జ‌న్ ధ‌న్ – భారీగా న‌గ‌దు జ‌మ

ఎవ‌ర‌న్నారు జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని. ఈ దేశం వంద కోట్ల‌కు పైగా జ‌నాభా వుండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కేవలం ఒకే ఒక్క రూపాయి చొప్పున జ‌మ చేస్తే చాలు..110 కోట్ల‌కు పైగా జ‌మ అవుతుంది. ఇది కూడా ఓ రికార్డే. ఆయా ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో భారీ ఎత్తున వ్య‌క్తిగ‌త‌, ఉమ్మ‌డి, క‌రెంట్ ఖాతాలు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా లాక‌ర్ల‌లో బంగారం, వెండి, వ‌జ్రాలు జ‌మ చేశారు ఇండియ‌న్స్. వీరితో పాటు ప్ర‌వాస భార‌తీయులు కూడా ప్ర‌త్యేకంగా త‌మ వారి కోసం డాల‌ర్లు పంపిస్తున్నారు. అవి కూడా వారి ఖాతాల్లో మూలుగుతున్నాయి. దీనిని గ‌మ‌నించిన ప్ర‌ధాని మోడీ అధికారంలోకి రాగానే వాటిపై క‌న్నేశారు. ఏకంగా మీరు జ‌మ చేయండి..మేము మీకు అంతే మొత్తంలో జ‌మ చేయ‌డంతో భారీగా జ‌న్ ధ‌న్ ఖాతాల‌లోకి వెల్లువ‌లా డ‌బ్బులు వ‌చ్చి ప‌డ్డాయి. పీఎం పిలుపుతో ల‌క్ష‌లాది మంది జ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చారు.

తాము క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న డ‌బ్బుల‌ను జ‌మ చేస్తూ పోయారు. రికార్డు స్థాయిలో ల‌క్ష కోట్ల‌కు చేరువ‌ల్లో డిపాజిట్లు జ‌మ కావ‌డంతో అటు బ్యాంకులు, ఇటు వాటిని నియంత్రిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చ‌ర్యానికి లోనైంది. 2014లో మొద‌టి సారిగా భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జ‌న్ ధ‌న్ మీ కోసం తెస్తున్నామ‌ని..మ‌హిళ‌లు దీనిని ఉప‌యోగించు కోవాల‌ని కోరారు. ఒక్క‌సారి మీరు క‌డుతూ వెళితే మేం మీకు త‌ప్ప‌నిస‌రిగా డ‌బ్బులు జ‌మ చేస్తామంటూ ప్ర‌క‌టించారు. ఐదేళ్ల కింద‌ట ఈ ప‌థకం కింద జీరో బ్యాలెన్స్ తో ఈ ఖాతాల‌ను పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఏప్రిల్ 3వ తేదీ నాటికి జ‌న్ ధ‌న్ ఖాతాల్లో దేశం మొత్తం మీద 97 వేల 665. 66 కోట్లుగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ తాజా గ‌ణాంకాలు వెల్ల‌డించాయి.

ఈ మార్చి 27 నాటికి ఈ ఖాతాల్లో డిపాజిట్లు 96 వేల 107.35 కోట్లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది. అంత‌కు ముందు వారంలో 95 వేల 382 .14 కోట్లు జ‌మ అయ్యాయి. కాగా దేశ వ్యాప్తంగా 35.39 కోట్ల జ‌న్ ధ‌న్ ఖాతాలు ఉన్నాయి. మరో వైపు 27 .89 కోట్ల ఖాతాదారుల‌కు రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు. దేశంలోని అన్ని కుటుంబాల‌కు బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులోకి తీసుకు రావాల‌న్న ఉద్దేశంతో కేంద్ర స‌ర్కార్ పీఎంజేడీవై ప‌థ‌కాన్ని తీసుకు వ‌చ్చింది. ఊహించ‌ని రీతిలో ప్ర‌జ‌ల నుండి స్పంద‌న రావ‌డంతో బీజేపీ స‌ర్కార్ జ‌న్ ధ‌న్ ఖాతాదారుల‌కు ప్ర‌మాద బీమా ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల‌కు పెంచింది.

అంతే కాకుండా ఓవ‌ర్ డ్రాఫ్ట్ ప‌రిమితిని 5 వేల నుండి 10 వేల‌కు పెంచింది. ఈ జ‌న్ ధ‌న్ ఖాతాదారుల్లో మ‌హిళ‌లే అధికంగా ఉండ‌డం విశేషం. అంతేకాకుండా 50 శాతం ఖాతాలు గ్రామీణ‌, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ ల‌బ్ధిదారుల‌కు ప్ర‌త్య‌క్షంగా న‌గ‌దును బదిలీ చేసేందుకు ఈ ఖాతాలు ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ్డాయి. మొత్తం మీద మోదీ చేసిన మంచి ప‌నుల్లో జ‌న్ ధ‌న్ ఖాతాల స్కీం గొప్ప‌ద‌ని ప‌లువురు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top