రంగంలోకి జనసేన కార్యకర్తలు….!

ఎన్నికల తర్వాత చాలా కాలం స్థబ్దుగా ఉన్న జనసేన కార్యకర్తలు గళమెత్తారు. విజయవాడ వీధుల్లో నినదించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్పెషల్  స్టేటస్  విషయంలో కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు నమ్మి మోసం చేశారని జనసేన కార్యకర్తలు ఆరోపించారు.  రాష్ట్రానికి చెందిన బీజేపీ, టీడీపీలకు చెందిన కేంద్రమంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.

Janasena followers-protest

వాస్తవానికి ప్రత్యేక హోదా విషయంలో హీరో శివాజీ దీక్ష కూడా చేశారు. ఇప్పుడు పవన్ అభిమానులు అందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇక టైం చూసుకొని జనసేన అధినేత పవన్ కూడా ప్రత్యేక హోదాపై  దీక్ష  చేస్తారో, లేక మోడీ తో తనకున్న అటాచ్మెంట్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో చూడాలి…..

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top