కోడి రామకృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు – పవన్

ప్రముఖ సీనియర్ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూసారు. గత కొద్దికాలం క్రితం వరకూ కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురి అయినా ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం మరింత క్షీణించడంతో అయన కన్ను మూసారు. అయితే కోడి రామకృష్ణ మృతి విషయం తెలుసుకున్న ఇటు తెలుగు చిత్ర పరిశ్రమ అటు అభిమానులకు దిగ్ర్బాంతికి లోనయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజ దర్శకుడిని కొల్పోయిందని, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కోడి రామకృష్ణ చేసిన సేవలు ఎనలేనివని, అయన లేకపోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అంటున్నారు. అయన స్థానాన్ని భర్తీ చేయడం కష్ట సాధ్యం అంటూ, అయన చేసిన సేవలను కొనియాడుతున్నారు. కోడి రామకృష్ణ తన ప్రస్థానాన్ని తెలుగులో మాత్రమే కొనసాగించలేదు. తమిళం కన్నడ హిందీ మలయాళంలో సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

దర్శకుడు కోడి రామకృష్ణ మరణానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. అయన మరణ వార్త తనను కలచివేసిందని , రామకృష్ణ మరణ వార్త విషయం తనకు తెలియడంతో తీవ్ర మనోవేదనకు గురి అయ్యానని అన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కోడి రామకృష్ణ స్థానం ఎవరు పూరించలేనిదంటూ అయన మృతికి సంతాపం ప్రకటించారు.

తెలుగులోనే కాక కోలీవడ్, శాండిల్ వుడ్ లో వందకుపైగా చిత్రాలను నిర్మించిన కోడి రామకృష్ణ మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారని అలాంటి వ్యక్తి అస్వస్థతకు లోనయ్యారని తెలిసీ ముందుగా కాస్త కంగారు పడ్డానన్నారు. తిరిగి అయన త్వరగా కోలుకుని మరికొన్ని మంచి సినిమాలను మన ముందుకు తెస్తారని ఆశించానని అన్నారు పవన్ కళ్యాణ్. ఇంతలోనే ఆయన మరణ వార్త వినవలసి వస్తుందని అనుకోలేదని అన్నారు. కోడి రామకృష్ణ మరణ వార్త నన్ను ఏంతో కలిచి వేసిందని అన్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించినా మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్య చిత్రంలో తన అన్నయ్య చిరంజీవి గారు కథానాయకుడిగా చేసారని గుర్తు తెచ్చుకున్నారు, అయన తన ప్రస్థానాన్ని మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు విభిన్న చిత్రాలను నిర్మించారని కొనియాడారు. ఆయన రూపొందించే సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవని అన్నారు. రామకృష్ణ గారి మరణ వార్త పరిశ్రమకు తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు. కోడి రామకృష్ణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు పవన్ కళ్యాణ్.

Comments

comments

Share this post

scroll to top