ఈ రోజు: 09-01-2019 బుధవారం రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?

మేషం:

నీలం రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మంచి జరుగును, పొద్దున్నే దైవ దర్శనం చేసుకొని మీ పనులు ప్రారంభించండి, వ్యాపారం లో స్వల్ప నష్టాలను చూస్తారు, పిల్లోళ్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించవలెను.

వృషభం:

పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, ప్రేమ విషయాల్లో కొట్లాటలు, దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతాయి, రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త.

మిథునం:

గులాబీ రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును. ఆరోగ్యం లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, వ్యాపారం లో స్వల్ప లాభాలు వస్తాయి, ఉద్యోగం లో తోటి ఉద్యోగస్తుల వల్ల ఇబ్బందులు ఎదురుకుంటారు.

కర్కాటకం:

ఆకు పచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును. స్నేహితుల మధ్య గొడవలు సంభవిస్తాయి. బంధువుల నుండి సాయం పొందుతారు. ప్రేమ విషయాల్లో ఇంకా బాధ పడతారు. చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండదు.

సింహం:

నీలం రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, రోడ్డు ప్రయాణాల్లో ఏ మాత్రం అజాగ్రత్త వహించిన కష్టమే, లేనిపోని ఆలోచనలు వల్ల ప్రశాంతత దెబ్బ తింటుంది. పొద్దునే దేవుడిని దర్శించుకొని పనులు మొదలు పెట్టడం ద్వారా ప్రశాంతత పొందుతారు.

కన్య:

గోధుమరంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దూరం అయిన వ్యక్తులు మళ్ళీ దెగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారు. స్నేహితుల ద్వారా సాయం పొందుతారు.

తుల:

ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, వ్యామోహాల వల్ల ఇబ్బందులు తప్పవు, అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారం అనుకోని మలుపు తిరుగుతుంది. అయిన వారి నుండి ఇబ్బందులు తప్పవు.

వృశ్చికం:

తెల్లటి దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, కొన్ని సంఘటనలు చూసి ఆశ్చర్యపోతారు. జీవితం లో ముందుకు సాగాలన్న పట్టుదల మీలో ఇంకా పెరుగుతుంది. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను.

ధనుస్సు:

నారింజ రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, దాంపత్య జీవితం లో అలజడి మొదలవుతుంది, ప్రేమ వ్యవహారం లో కష్టాలు ఎదురవుతాయి, మిత్రుల సహకారం వలన కొన్ని కష్టాల్లో గట్టెక్కుతారు.

మకరం:

పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును. లావాదేవీల విషయాల్లో జాగ్రత్త వహించవలెను, నమ్ముకున్న వారి నిజస్వరూపం బయటపడును, కష్టాలకు బయపడి వెనుకడుగు వెయ్యడం ద్వారా గొప్ప అవకాశాన్ని పోగొట్టుకుంటారు.

కుంభం:

నీలం రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, ఆడవాళ్లు కొంచెం జాగ్రత్త గా ఉండాలి, అమ్మవారిని ఆరాధించడం ద్వారా మంచి జరుగును, ప్రేమించిన వారివలన బాధ పడతారు, జీవితం లో మునుపెన్నడూ చూడని సంఘటనలు కొన్ని చూస్తారు.

మీనం:

తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మంచి జరుగును, మీ మీద మీకు నమ్మకం లేనిచో మీరు చాలా కోల్పోతారు, పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకోడం వలన మంచి జరుగును, రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను.

Comments

comments

Share this post

scroll to top