టెర్ర‌రిస్టు కుటుంబానికి 4 లక్షల ఎక్స్ గ్రేషియా+ ప్రభుత్వ ఉద్యోగం.!

హిజ్‌బుల్ ముజాహిదీన్ అనే ఓ టెర్ర‌రిస్టు గ్రూపుకు చెందిన ఓ యువ‌కుడి కుటుంబానికి జమ్మూ కాశ్మీర్ ప్ర‌భుత్వం రూ.4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించ‌నుంది. అంతేకాకుండా, ఆ కుటుంబంలో ఒకరికి ప్ర‌భుత్వ ఉద్యోగం కూడా ఇవ్వ‌నున్నారు. అవును, మీరు వింటున్న‌ది నిజ‌మే. ఎంత‌టి షాకింగ్ ఉన్నా ఈ సంఘ‌ట‌న మాత్రం ఇప్పుడు దేశ‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టెర్ర‌రిస్టు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌డ‌మేంటి, అది కాకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నారు, ఇదంతా ఎందుకు..? అంటూ అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఈ సంఘ‌ట‌న నిజ‌మే అయినా… అస‌లు దీని వెనుక ఉన్న మొత్తం క‌థ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

burhan-wani
అత‌ని పేరు బుర్హ‌న్ వ‌నీ. హిజ్‌బుల్ ముజాహిదీన్ అనే ఓ టెర్ర‌రిస్టు గ్రూపుకు చెందిన క‌మాండ‌ర్ అత‌ను. అత‌ని కుటుంబం ఉంటోంది జ‌మ్మూ కాశ్మీర్‌లోని లోరిగాం లోని త్రాల్ అనే ప్రాంతం. అత‌ని తండ్రి పేరు ముజ‌ఫ‌ర్ వ‌నీ. లోరిగం లో ఉన్న ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల ప్రిన్సిపాల్ అత‌ను. బుర్హ‌న్ వనీకి అన్న కూడా ఉన్నాడు. అత‌ని పేరు ఖ‌లీద్ వ‌నీ. ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో పొలిటిక‌ల్ సైన్స్ విద్య‌ను అభ్య‌సిస్తున్నాడు. అయితే 2013లో అడ‌విలో తిరుగుతున్న ఖ‌లీద్‌ని టెర్ర‌రిస్టు అనే అనుమానంతో అరెస్టు చేసి ఆర్మీ సిబ్బంది ఎన్‌కౌంట‌ర్ చేశారు.

ఈ క్ర‌మంలో అత‌ను టెర్ర‌రిస్టు కాద‌ని, కానీ అడ‌విలో ఉన్న త‌న త‌మ్ముడైన బుర్హ‌న్ వ‌నీని క‌ల‌వ‌డం కోస‌మే అడవికి వెళ్లాడ‌ని, అక్క‌డ ఆర్మీ చేతికి దొర‌క‌డంతో అత‌ను దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఎన్‌కౌంట‌ర్‌కు గుర‌య్యాడ‌ని తెలిసి అక్క‌డి ప్ర‌భుత్వం ఖ‌లీద్‌కు అంటే బుర్హ‌న్ వ‌నీ కుటుంబానికి రూ.4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారంతోపాటు ప్ర‌భుత్వ ఉద్యోగం కూడా ప్ర‌క‌టించింది. దీంతో ఈ విష‌యంపై దేశ‌మంత‌టా చ‌ర్చ న‌డుస్తోంది. టెర్ర‌రిస్టు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వ‌డ‌మేమిట‌ని జ‌మ్మూ కాశ్మీర్ సీఎం మెహ‌బూబా ముఫ్తీని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే దీనికి అక్క‌డి ప్ర‌భుత్వ పెద్ద‌లు కొంద‌రు ఏమంటున్నారంటే ఖ‌లీద్ నిజంగా టెర్ర‌రిస్టు కాద‌ని, అత‌నిపై ఎలాంటి ఫిర్యాదులు లేవ‌ని, ఒక సాధార‌ణ పౌరుడే అవ‌డం చేత అత‌ను దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆర్మీ చేతితో చ‌నిపోవ‌డంతో అలాంటి బాధిత కుటుంబాల‌కు ఇచ్చే విధంగానే రూ.4 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం, ప్ర‌భుత్వ ఉద్యోగం అందజేస్తున్నామని అంటున్నారు. కానీ దీనిపై ఇంకొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై చ‌ర్చ ఇంకా ఎంత‌టి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చెప్ప‌లేం..!

Comments

comments

Share this post

scroll to top