ఎలాంటి వాతావరణంలో మన సైనికులు మనకు రక్షణగా ఉంటున్నారో తెలుసా?

భార‌త్ – పాక్ స‌రిహ‌ద్దులు.. నిత్యం యుద్దం వాతవ‌ర‌ణం.. ఇక్క‌డి విధులు నిర్వ‌హించ‌డ‌మంటే క‌త్తిమీద సామే. ఏ నిమిషం ఏం జ‌రుగుతుందో.. శ‌త్రువు ఏ వైపు నుండి దూసుకు వ‌స్తాడో కాచుకు కూర్చోవాల్సిన ప‌రిస్థితి. కానీ ఓ భార‌త్ – పాక్ స‌రిహ‌ద్దు వ‌ద్ద వాత‌వ‌ర‌ణ‌మే ప్రధాన శ‌త్రువుగా మారి ప్రాణాల‌ను తీస్తోంది. రెప్ప‌పాటు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిన ఇక అంతే సంగ‌తులు. అదే.. ప్రపంచంలోనే ప్రాణాంతక సరిహద్దుగా పేరు మూట‌గ‌ట్టుకున్నప్రాంతం జ‌మ్మూ. సముద్రమట్టానికి 4,000 మీటర్ల ఎత్తు నియంత్రణ రేఖ (ఎల్‌.ఒ.సి.) వ‌ద్ద ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్క‌డ అస‌లేం జ‌రుగుతుంది.. సైనికులు ప్రాణాలు ఎలా గాల్లో క‌లుస్తున్నాయి..? ముష్క‌ర మూక‌ల‌కంటే ముందే ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న వారెవ‌రో..? తెలుసుకుందాం.sai2

సైనికపరంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా పేరొందిన భారత్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతం జ‌మ్మూ లోని నియంత్రణ రేఖ (ఎల్‌.ఒ.సి.). ఇక్క‌డ నిత్యం సైనికులు కాపల కాస్తు ఉంటారు. అయితే ఈ ప్రాంతం ప్ర‌మాద‌క‌రం అన‌డానికి కార‌ణం ఇక్క‌డి వాత‌వ‌ర‌ణ‌మే. స‌ముద్ర మ‌ట్టానికి 4000 మీట‌ర్ల ఎత్తులు.. నిత్యం వందల కిలో మీట‌ర్ల వేగంతో వీచే  మంచు గాలుల‌తో నిత్యం న‌ర‌క‌ప్రాయంగా ఉంటుంది ఈ ప్ర‌దేశం. సైనికులు త‌ప్ప చుట్టు న‌ర‌మాన‌వుడు కూడా క‌నిపించ‌ని ప్రాంతమిది. ఇక ఇక్క‌డి వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం అత్యంత స్వల్పం. క‌నీసం ఊపిరి పీల్చుకునేందుకు కూడా వీలులేకుండా ఉంటుంది. అంతే కాదు పై నుండి ఎప్పుడు ఏ క్ష‌ణంలో మంచు తుఫాన్ ముంచుకు వ‌స్తుందో తెలియని ప‌రిస్థితి. ఇక్క‌డ కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌దిలో 19 మంది భ‌ద్రతా సిబ్బంది చ‌నిపోయారు. ఒక్క భార‌త్ సైనికులే కాదు మ‌న వాళ్ల‌ని మ‌ట్టు పెట్టాల‌ని వ‌చ్చిన పాక్ ముష్క‌రులు సైతం 16 మంది చ‌నిపోయిన‌ట్టు పాక్ పోర్కొంది. అంతే కాదు 127 మంది పాక్ కు చెందిన‌ సామాన్య ప్ర‌జ‌లు ఈ వాత‌వ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక చ‌నిపోయారు. దీన్ని బ‌ట్టి ఇక్కడి వాత‌వ‌ర‌ణ ప‌రిస్థితి ఎంత భ‌య‌క‌రంగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

siachin

మాములు కాలంలోనే అక్క‌డి వాత‌వ‌ర‌ణం మైన‌స్ డిగ్రీల్లో ఉంటుంది. ఇక ఈ శీతాకాలంలో ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంది. మన దగ్గర ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు చేరుకుంటేనే వణికిపోతాం. అటువంటిది శీతాకాలంలో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్‌ 20కు పడిపోతుంటుంది. బంకర్లపై 20 అడుగులపైగా మంచు పేరుకుంటుంది.. దాని బరువుకు బంకర్‌ కూలిపోయే ప్ర‌మాదము లేక‌పోలేదు. అప్పుడే కురిసిన మంచు మెత్తగా ఉంటుంది ఆ స‌మ‌యంలో అడుగుతీసి అడుగు వేయడం మ‌రింత‌ కష్టంగా ఉంటుంది. ఇక విధుల్లో ఉన్న సైనికులు దాదాపు 75 నుండి 90 కిలోల బ‌రువును నిత్యం మోస్తునే గ‌స్తీ తిర‌గాలి. ఈ బ‌రువుకి తోడు శ‌రీర బ‌రువుతో న‌డుస్తున్న సందర్బంలో మంచులో కూరుకుపోయే అవ‌కాశం లేక‌పోలేదు. ఇక‌ కొత్త వ్యక్తులు ఈ ప్రాంతానికి వస్తే వెంట‌నే సృహ తప్పి పడిపోతారు, కార‌ణం మెదడుకు సరిపడనంతా ఆక్సిజన్‌ అందకపోవడం. దీంతో మాట తడబడటం, ప్రవర్తనలో మార్పు రావడం చ‌నిపోవ‌డం కూడా జ‌రుగుతుంది. ఇంత ప్ర‌మాదం ఉన్న 125 కోట్ల ప్రాణాల కోసం త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా సైనికులు నిత్యం కాపాల కాస్తునే ఉన్నారు. వారి దీక్ష ద‌క్ష‌తకు సెల్యూట్.

Courtesy: Eenadu.

siachenmain_2612924a

Comments

comments

Share this post

scroll to top