జేమ్స్ బాండ్ (నేను కాదు నా పెళ్ళాం) రివ్యూ అండ్ రేటింగ్.

అల్లరి నరేష్ సాక్షి చౌదరి  హీరో హీరోయిన్ లుగా..సాయి కిషోర్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన  చిత్రం జేమ్స్ బాండ్ (నేను కాదు నా పెళ్ళాం). నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మీద మా రివ్యూ అండ్ రేటింగ్( ఇవి కేవలం మా అభిప్రాయాలు మాత్రమే).

అల్లరి నరేష్ అంటేనే కామెడీ….కామెడీ అంటేనే అల్లరి నరేష్ , అంతగా పేరుతెచ్చుకున్నాడీ సడన్ స్టార్. జేమ్స్ బాండ్ కూడా పూర్తి ఎంటర్ టైన్మెంట్ సినిమానే. కాకపోతే  సాక్షి చౌదరిని డాన్ గా చూపించి కాస్తంత ఫైటింగ్ ను మిక్స్ చేసి మరింత కామెడీని పండించారు.

james bond

STORY LINE:

దుబాయి లో ఉండే పూజ(సాక్షి చౌదరి) కొన్ని కారణాల రీత్యా ఇండియాకు వస్తోంది. నాని ( అల్లరి నరేష్) ఫస్ట్ లుక్ లోనే ఫిదా అయిపోతాడు ఆమెకి,  అనుకోకుండానే వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిపోతోంది. తర్వాత పూజ లేడీ డాన్ అని తెలుస్తోంది. డాన్  లాంటి భార్యను పెళ్లి చేసుకొని నాని  ఎలాంటి కష్టాలు అనుభవించాడనేదే సినిమా స్టోరి.

Analysis:

కామెటీ టచ్ ను టైటిల్స్ నుండే పండించాడు డైరెక్టర్, పోసానీ, కృష్ణ భగవాన్ ,ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ,అలి, జయప్రకాశ్ రెడ్డి, సప్తగిరి, జబర్థస్త్ రఘు..హేమ ఇలా అందరు కమెడియన్స్ కథకు తగ్గట్టుగా వాడుకొని ఫుల్ ఆఫ్ ఫన్ ను పంచేశాడు డైరెక్టర్.  కథలో దమ్ము లేనప్పటికీ… కామెడీకి మాత్రం పైసా వసూల్ సినిమా ఇది. కెమెరా వర్క్, కొరియోగ్రఫి కూడా బాగుంది. ట్రైలర్ చూస్తే సగం సినిమా అర్థం అయిపోతోంది.

Plus:

  • అల్లరి నరేష్ నటన
  • కృష్ణ భగవాన్ టైమింగ్
  • కథ పాతదే అయిన ఫన్ పంచే సీన్లు.
  • సాక్షి గ్లామర్.

Minus:

  • స్టోరి.
  • పాటలు.

On Line  Review:

ఇది కితకితలే….అక్కడ లావున్న పెళ్ళాంతో బాధలు, ఇక్కడ డాన్ లాంటి పెళ్లాం తో బాధలు మిగాతాది సేమ్ టు సేమ్

Rating:

2/5(**)

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top