ఆ కలెక్టర్ ఐడియాతో 25 వేల మంది స్కూల్ పిల్లల కాళ్ళకు షూస్ వచ్చాయ్.!

సమాజాన్ని మార్చాలంటే ముందు మనం మారాలని’నిరూపించాడు రాజస్థాన్ లోని జలోర్ జిల్లా కలెక్టర్ జితేంద్రకుమార్ సోని. కొన్ని రోజుల క్రితం జితేంద్రకుమార్ జిల్లాలోని గ్రామాలలో పర్యటిస్తున్నాడు. అలా తన కారులో వెళ్తుండగా, స్కూల్ కు వెళ్తున్న పిల్లలలో కొంతమంది,పుస్తకాల బ్యాగ్ తగిలించుకొని పరుగులు తీస్తూ వణుకుతున్నారు. వారికి నడవడానికి చెప్పులులేవన్న సంగతి గమనించాడు. అది డిసెంబర్ మాసం చలి తీవ్రత విపరీతంగా ఉంది. అయితే ఆ పిల్లల దుస్థితి చూసిన కలెక్టర్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. పేదరికం ఎలా ఉంటుందో తనకి తెలుసు. వెంటనే చెప్పుల షాప్ కు వెళ్లి ఆ పిల్లలకోసం షూస్ తీసుకువచ్చాడు కలెక్టర్. స్కూల్ కి వెళ్లి ఇలా షూస్ లేకుండా ఎంతమంది ఉన్నారో కనుక్కున్నాడు. చాలా మంది ఉన్నారనే విషయం అర్థమైంది.

S-1-3

ఒకరినో ఇద్దరినో ఈ ప్రాబ్లం నుండి బయటపడేయటం కాదు జిల్లాలో ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలను ఆదుకోవాలి అని ‘చరణ్ పాదుకా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టాడు. షూస్, చెప్పులు పాదరక్షలు లేకుండా స్కూల్ కు వస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో సర్వే నిర్వహించమన్నాడు. 274 గ్రామ పంచాయితీలు, 3 నగర పాలిక ప్రాంతాలలో 2500 స్కూల్స్ గానూ సగటున 10 మంది పాదరక్షలు లేకుండా వస్తున్నారని తెలిసింది. వెంటనే తన ప్రణాళికను అమలు చేశాడు. అయితే బ్రాండెడ్ షూస్ మార్కెట్లో రూ.200 పైనే ఉంటుంది. అయితే 25000 మంది విద్యార్థులకు షూస్ అందించటం ఖర్చుతో కూడుకున్నది. అన్ని నిధులు సమకూర్చటం కష్టమైన పని. అందుకే తన కార్యాలయానికి వచ్చే ప్రజలు, అధికారులు తమకు తోచినంత సాయం చేసేలా ‘చరణ్ పాదుకా యోజన’ పథకం అమలు చేశాడు.

barefoot-at-school

పేద పిల్లలకు పాదరక్షలు అందించడానికి అని అక్కడ రాశాడు. కొద్ది రోజులలో 25000 మంది విద్యార్ధులకు కావాల్సిన పాదరక్షలకు నిధులు చేకూరాయి. అయితే వీటిని ఆ విద్యార్థులకు గణతంత్రదినోత్సవం నాడు అందించాలని కలెక్టర్ జితేంద్రకుమార్ సోని నిర్ణయించాడు. మంచి చేయలన్నా ఆలోచన ఎంత గొప్పదో అది ఆచరణలోకి వచ్చినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పుకోలేనిది. నిజంగా ఆ కలెక్టర్ మనసు చాలా గొప్పదికదా. జితేంద్ర తండ్రి గడియారాలు తయారుచేస్తూ ఎంతో కష్టపడి తనను ఈ స్టేజ్ కు రావడానికి కారకుడయ్యాడని, హనుమాన్ ఘర్ లోని రావత్సర్ ప్రాంతంలోగల ధన్సర్ గ్రామం జితేంద్ర ఊరు. ప్రతి ఏటా పేద విద్యార్థులకు ‘చరణ్ పాదుకా యోజన’ పథకం ద్వారా పాదరక్షలు ఇస్తానని ఆ కలెక్టర్ తెలిపాడు.

Comments

comments

Share this post

scroll to top