జై సింహ, అజ్ఞాతవాసి కలెక్షన్స్ ఎంతో తెలుసా.? ఏది ఎక్కువ వసూలు చేసిందంటే..?

సినిమా ప్రేక్షకులకు పండుగ వాతావరణం స్టార్ట్ అయింది..అజ్ణాతవాసి తో ప్రారంభించిన పండుగ సంబురాలు జై సింహతో ముందుకు వెళ్తుంది…మరిన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ ఎప్పటిలానే ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ బాలయ్యబాబే అంటున్నారు సిని విశ్లేషకులు..పోయిన ఏడాది శాతకర్ణితో హిట్ కొట్టిన బాలయ్య బాబు ఈ సారి జై సింహతో ప్రేక్షకులను అలరించారు..బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘జై సింహా’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రియుల నుంచి కూడా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల గురించి ఆసక్తికర చర్చే జరుగుతుంది….
అమెరికాలో ఓ రోజు ముందుగానే అంటే గురువారమే సందడి చేసింది. అమెరికాలో జై సింహా ఓవర్సీస్ హక్కులను ‘సరిగమ సినిమాస్’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. అమెరికా వ్యాప్తంగా మొత్తం 92 లొకేషన్లలో విడుదలయింది. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా ఒక లక్షా 3వేల 802 డాలర్లను కలెక్ట్ చేసింది. కాగా జై సింహా కంటే రెండు రోజులు ముందుగానే విడుదలయిన అజ్ఞాతవాసికి కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. గురువారం ప్రీమియర్ల ద్వారా జై సింహాకు వచ్చిన కలెక్షన్ల కంటే చాలా తక్కువ మొత్తంలోనే అజ్ఞాతవాసికి కలెక్షన్లు వచ్చాయి. గురువారం అజ్ఞాతవాసికి 42వేల 194 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు భారీ స్థాయిలో విడుదలవడం, అంచనాలు తారస్థాయిలో ఉండటం, టికెట్ రేటు కూడా అధికంగా ఉండటంతో.. ప్రీమియర్ల ద్వారా ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు పైగానే కలెక్ట్ చేసింది. అయితే ఆ తర్వాత అజ్ఞాతవాసికి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గాయి. అమెరికాలో గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలయిన జై సింహా.. కలెక్షన్లలో అజ్ఞాతవాసిని దాటేయడం గమనార్హం….

Comments

comments

Share this post

scroll to top