“జై లవకుశ” మొదటి 3 ప్రీమియర్ టికెట్స్ ధర ఎన్ని వేలో తెలుసా.? చెన్నై స్టూడెంట్స్ కొన్న టికెట్ డబ్బుతో ఏం చేసారంటే.!

ఒక పాత్ర ఇచ్చి చేయవయ్యా అంటే… పిల్లల హోమ్ వర్క్ అమ్మలు చేసినంత ఈజీగా చేయగల యాక్టర్ ఎన్టీఆర్.ఎన్టీఆర్ కంటూ ప్రత్యేకంగా చెప్పుకోటానికి లెక్కలేనన్ని స్కిల్స్ ఉన్నాయి.డైలాగ్ చెప్పడానికి కంటి రెప్పల వెంట్రుకలు నుండి డ్యాన్స్ చేయడానికి శరీరంలో ప్రతి పార్ట్ ఎన్టీఆర్ కి హెల్ప్ చేస్తాయి.  వర్షం పడేప్పుడు ఎంత సహజంగా ఉరుములొస్తాయో అంతే సహజంగా పాత్రలో జీవించేస్తాడు.అంతటి నటుడికి జై లవకుశ ఒక మంచి అవకాశం..సినిమా చూసొచ్చిన అందరూ జై పాత్ర గురించి,అందులో ఎన్టీఆర్ అద్భుత నటన గురించే మాట్లాడుకుంటున్నారు..ఆ పాత్రే కాదు అంతకంటే పెద్ద పాత్రలు ఇచ్చినా ఎన్టీఆర్ అలవోకగా చేసేయగలడు అనేది చాలామంది అభిప్రాయం.

రాజకీయాల పరంగా కొన్ని విభేధాలున్నప్పటికి అందరూ ఎన్టీఆర్ ని నటుడిగా ఆదరిస్తారు..తారక్ నటనకు ఫిదా అవుతారు..అలా ఫిదా అయిన వారే..దర్శకదీరుడు రాజమౌలి కూడా ఎన్టీఆర్ నటనని మెచ్చుకుంటూ  “తారక్.. నా హృదయం గర్వంతో నిండిపోతోంది. మాటల్లో నా ఫీలింగ్స్ ని చెప్పలేకపోతున్నా .. జై.. జై.. జై లవకుశ” ట్వీట్ చేశారు..మరోవైపు చెన్నైలోని ఎస్ ఆర్ ఎమ్ కాలేజ్ కి చెందిన స్టూడెంట్స్ జై లవకుశ ప్రీమియర్ షో మొదటి మూడు టికెట్స్ ని పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి  సొంతం చేసుకున్నారు..ఇంతకీ ఆ అమౌంట్  ని ఆ ధియేటర్ యాజమాన్యం బసవతారకం హాస్పటల్ కి డొనేట్ చేయాలని భావిస్తున్నది..ఇంతకీ వారు ఆ టికెట్స్ కొనుగోలు చేసింది ఎంత అమౌంట్ కో తెలుసా..61000,35000,15000…

Comments

comments

Share this post

scroll to top