పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రియంకా చోప్రా..ట్రైలర్ తోనే ప్రియాంక ఫిదా చేసింది.

హీరోయిన్ గా అలరిస్తూనే, కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో అలరిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. రీసెంట్ గా అమెరికన్ టెలీ సీరియల్ ‘ క్వాంటికో’ లో అలరించిన ప్రియాంక, ప్రస్తుతం ‘ జై గంగాజల్’ సినిమాలో పవర్ ఫుల్ కాప్ గా నటిస్తోంది. 2003లో ప్రకాష్ ఝా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ గంగాజల్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ గంగాజల్’ లో అజయ్ దేవగన్ లీడ్ రోల్ చేయగా, ఆ సినిమా  సూపర్ హిట్ గా నిలిచింది.ఉత్తరరాష్ట్రాలలోని ఒక గ్రామంలో అక్కడి లోకల్ గూండాలు, రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతిని అంతం చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో ప్రియాంక నటన అద్భుతం. రైతుల ఆత్మహత్యలు, అవినీతి, పోలీస్ డిపార్ట్ మెంట్ లో జరుగుతున్న మోసాలు, తమ డిపార్ట్ మెంట్ కొలీగ్స్ ని ఏ విధంగా మోటివోట్ ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందనే కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ నెటిజన్స్ ను అలరిస్తోంది. ప్రకాష్ ఝా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2016 మార్చి 4న రిలీజ్ కానుంది.

Watch Trailer:

Comments

comments

Share this post

scroll to top