తన కూతురు కెరీర్ కోసం తాపత్రయపడిన శ్రీదేవి సరిగ్గా తనకి అవసరం అయిన సమయంలోనే దూరం కావడం విషాదం..పిల్లల బాద్యత తండ్రి బోనీ తీసుకున్నప్పటికి తల్లి లేని లోటు పూడ్చలేనిదే కదా.జాహ్నవి కపూర్ 21వ వసంతంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.ఈ సంధర్బంగా జాన్వి తల్లికి రాసిన ఒక లెటర్ నెటిజన్లను కంటతడి పెట్టించింది. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉన్న జాహ్నవి కపూర్‌కు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసారు. తాజాగా జాహ్నవి కపూర్ బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్ కూడా జాహ్నవిని ఇన్స్టాగ్రామ్ ద్వారా విష్ చేశాడు. దానికి జాహ్నవి కూడా రిప్లై ఇచ్చింది.
ఎవరీ అక్షత్ రంజన్?జాహ్నవితో పరిచయం ఎలా?
జాహ్నవి బాయ్ ఫ్రెండ్ అక్షత్ రంజన్….. కపూర్ ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్.అక్షత్ రంజన్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు. ముంబైలో స్కూల్ డేస్ నుండే అక్షత్, జాహ్నవి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటి నుండే ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది.వారి స్నేహం కారణంగా కపూర్ ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యాడు. జాహ్నవికి ఉన్న స్నేహితుల్లో అక్షత్ రంజన్ చాలా స్పెషల్ అని అంటుంటారు. శ్రీదేవి బ్రతికున్న సమయంలో బోనీ కపూర్ ఫ్యామిలీ ఔటింగ్‌కు వెళ్లిన సమయంలో అక్షత్ రంజన్ కూడా వారితో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. గౌరీ షిండే దర్శకత్వంలో వచ్చిన ‘డియర్ జిందగీ’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో శ్రీదేవి, బోనీ కపూర్, జాహ్నవిలతో కలిసి ఒకే కారులో అక్షత్ రంజన్ కనిపించడం అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
ILY అంటూ జాన్వి రిప్లై…
జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలసి దిగిన ఫోటోను అక్షత్ రంజన్ పోస్టు చేశాడు. ఇలాంటి పట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ కామెంట్ పోస్టు చేశాడు. అక్షత్ రంజన్ బర్త్ డే విషెష్‌పై…. జాహ్నవి కపూర్ వెంటనే స్పందించారు. ILY (ఐ లవ్ యూ) అంటూ రిప్లై ఇచ్చారు. తల్లి చనిపోయిన సమయంలో విషాదంలో ఉన్న జాహ్నవికి అక్షత్ రంజన్ ఎమోషనల్‌గా చాలా సపోర్టుగా ఉన్నాడు.