కులం-ఇంట‌ర్ కాస్ట్ మ్యారేజెస్-అక్ర‌మ సంబంధాల‌పై… జ‌గ‌ప‌తి బాబు అద్భుత‌మైన ఇంట‌ర్వ్యూ.!!

క్యాస్ట్ విష‌యంలో ఎప్పుడూ అగెనెస్ట్ గా హీరో జ‌గ‌ప‌తి బాబు మ‌రోసారి కాస్ట్ విష‌యంలో త‌న వర్ష‌న్ బ‌లంగా వినిపించారు.! TV-9 వెలిప్రేమ అనే ప్రోగ్రామ్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జ‌గ‌ప‌తి బాబు చాలా ఆస‌క్తిక‌ర, ఆద‌ర్శ‌దాయ‌క‌ వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు.!

కులం గురించి.
కులం కులం అంటారు..అదే కులంలో ఓ వ్య‌క్తి ఎదుగుతుంటే…వాడిని తొక్కేస్తుంటారు.! వంద కోట్లు వ‌స్తున్నాయంటే…ఏ మినిష్ట‌ర్ కాల్లైనా ప‌ట్టుకుంటారు…అప్పుడు వాడి కులం అవ‌స‌రం లేదు.!

ఇంట‌ర్ కాస్ట్ మ్యారేజెస్…
జీవితాంతం క‌లిసి బ‌తకగ‌లం అనే న‌మ్మ‌కం చేసుకోబోయే వాళ్ల‌కుంటే….మ‌ద్య‌లో మీరెవ‌రు? నా కూతురి విష‌యంలో కూడా ర‌చ్చ చేద్దామ‌ని ప్ర‌య‌త్నించారు. డ్ర‌గ్స్ కేసులో నా అమెరికా అల్లుడిని జైల్లో పెట్టిద్దామ‌నుకున్నారు.!

అక్ర‌మ సంబంధాల‌పై….
పెళ్లి చేసుకోవ‌డానికి కులాన్ని ప‌ట్టించుకునే వాళ్లంతా…అక్ర‌మ సంబంధం పెట్టుకునేట‌ప్పుడు మాత్రం దానిని ప‌ట్టించుకోరు.! కేవ‌లం సుఖం కోసం మాత్ర‌మే చూస్తారు.!

సిద్దార్థ కాలేజ్ గురించి.
సిద్దార్థ‌ కాలేజ్‌కు 10ఏళ్ల క్రితం తనను ఆహ్వానించారు . ఆ స‌భ‌లో కులానికి వ్యతిరేకంగా తాను మాట్లాడుతానంటే అక్కడున్న ప్రిన్సిపల్ అలా చేస్తే విద్యార్థులు మిమ్మల్ని చంపేస్తార‌ని హెచ్చరించారన్నారు. కానీ తాను సభలో క్యాస్ట్‌ కు వ్యతిరేకంగానే మాట్లాడుతుంటే…. విద్యార్థులు చప్పట్లు కొట్టారు .!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top