జగ్గుదాదా కులాల గురించి కొట్టిపారేశారు. ఇప్పుడు జగ్గుభాయ్ చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారాయ్..కులాల గురించి ప్రస్తావిస్తూ జగపతి బాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.. తనది వీరమాచనేని వంశం అని…ఈ వంశం కమ్మ కులంలో పెద్దదని..అయినప్పటికీ తాను తన కుమార్తెకు ఓ అమెరికా కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసానని తెలిపారు. అలా ఎలా చేస్తారు అంటూ చాలామంది ప్రశ్నించారని..అయితే నా కూతురు ఆ అమెరికా అబ్బాయిని ఇష్టపడితే పెళ్లి చేశామని ఇందులో కులాల ప్రస్తావన ఎందుకుని జగపతిబాబు చెప్పారు.ఇద్దరు ఇష్టపడినప్పుడు వారి మధ్య కులాల ప్రస్తావన ఎందుకున్నారు.
నాకు వారసులు లేరు. నాతోనే ఈ వీరమాచనేని వంశం అంతమవుతందని అంటున్నారు. అలా అయితే వచ్చే నష్టం ఏముంటదని ఆయన ప్రశ్నించారు. తాను చనిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో తాను చూడనని అలాంటప్పుడు ఈ కులాల ప్రస్తావన అంతా ట్రాష్ అని ఆయన కొట్టి పాడేశారు జగ్గూభాయ్ కులాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని ఆయన అన్నారు.