సోషల్ మీడియాలో మరోసారి వివాదాల పాలైన జబర్ధస్త్ యాంకర్..

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాంకర్ అనసూయ తరచూ వివాదాలు కూడా ఎదుర్కొంటోంది. గతంలో ఆంటీ అన్నందుకు ఫాలోవర్లపై మండిపడింది అనసూయ. ఇప్పుడు పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై స్పందించి మరోసారి విమర్శలు పాలైంది. అనసూయ చేసిన ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. దాడిపై సంతాపం వ్యక్తం చెయ్యని నువ్వు… బాధని, ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కించపరుస్తావా అంటూ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.
మరికొంత మంది మాత్రం అనసూయకు అండగా నిలితారు. ఈ దాడి పట్ల చాలామంది పాక్ పై నిరసనలు తెలుపుతూ దాడికి పాల్పడిన వారందరిని చంపేయాలని కామెంట్లు పెడుతున్నారు.


దీనిపై అనసూయ చేసిన పోస్ట్ ఏంటి అంటే….
”నిజంగా ఆ బాధను అనుభవించిన వ్యక్తులకు, కేవలం అరిచే (Noice) వ్యక్తులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది చూపిస్తోంది” అంటూ అనసూయ.. అమర జవాను లెఫ్టినెంట్ జనరల్ గౌతమ్ రవింద్రనాథ్ కుమార్తె మానసి స్కాట్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సోషల్ మీడియాలో ప్రతీకారం తీర్చుకుందామని వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులను ఉద్దేశిస్తూ.. మానసి తన తల్లి చెప్పిన మాటలను పోస్ట్ చేసింది.

మానసి ట్వీట్ :
”సోషల్ మీడియాలో ప్రతీకారం తీర్చుకుందామని ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే.. అక్కడ పోరాడి, మీ కోసం ప్రాణాలు అర్పించేది మీరు కాదు కాబట్టి. మీరు రోడ్లపైనే మూత్రం పోస్తారు, ఉమ్ములు వేస్తారు, రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తారు, ఘోరంగా డ్రైవింగ్ చేస్తారు, అమ్మాయి, మహిళలపై అరుస్తారు. కులం, మతం, ప్రాంతాల వారీగా విడిపోయి ద్వేషించుకుంటారు. ఎన్నికల్లో నేరగాళ్లకు ఓటేస్తారు. మీరు చెబుతున్న ‘ప్రతీకారం’ విలువ తెలుసుకోండి. లేదా మీరే వెళ్లి ప్రతీకారం తీర్చుకోండి. అక్కడ తమ కుటుంబాలను వదులకుని డ్యూటీ చేస్తున్నవారికి బాధ్యతలను గుర్తుచేయాల్సిన అవసరం లేదు” అని మానసి తల్లి పేర్కొన్నారు.

ఈ పోస్టు చేసిన అనసూయ తన సొంత వ్యాఖ్యలను కాకుండా.. మానసికి రిప్లై ఇచ్చిన ప్రియాంక అనే యువతి వ్యాఖ్యలను తన ఫేస్‌బుక్‌లో కాపీ-పేస్ట్ చేసింది. దీంతో కొందరు అనసూయను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై అనసూయ లైవ్ చాటింగ్ ద్వారా స్పందించింది.

Comments

comments

Share this post

scroll to top