సెలబ్రిటీలు కదా : రైల్వేస్టేషన్ లో జబర్ధస్త్ టీం హల్ చల్

షేకింగ్ శేషు,షకలక శంకర్,చమ్మక్ చంద్ర,సుడిగాలి సుధీర్ ఏంటి జబర్దస్త్ కమెడియన్స్ లిస్టు చదువుతున్నారు అనుకుంటున్నారా..జబర్దస్త్ కి ముందు వీరెవరో ఎవరికి తెలీదు..జబర్దస్త్లో ఒక్క స్కిట్ చేసినా చాలు వీళ్లని టక్కున గుర్తు పట్టేస్తాం..సెలబ్రిటి స్టాటస్ ఇచ్చేస్తాం.అంతలా పాపులర్ అయింది జబర్దస్త్..అందులో యాక్ట్ చేసే వారు కూడా.. ఇప్పుడు ఆ సెలబ్రిటీసే మేం సెలబ్రిటిలం మమ్మల్ని పట్టుకుని అంతమాటంటావా అంటూ గొడవకి దిగారు..ఇంతకీ ఎవరితో గొడవ పడ్డారు అసలేం జరిగింది..

జబర్దస్త్లో  నటించే షేకింగ్ శేషు తెలుసు కదా.ఇటీవల రంగస్థలంలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు.అతను మరికొంత మంది జబర్దస్త్ టీం సభ్యులు విశాఖ రైల్వేస్టేషన్ లో మేం సెలబ్రిటిలం అంటూ హల్ చల్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో షేకింగ్ శేషు అండ్ టీం హంగామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాపిక్ అన్నమాట. విజయనగరం నుంచి వైజాగ్ వరకు వస్తున్న వీరు జనరల్ టికెట్ తీసుకున్నారు. అయితే థర్డ్ ఏసీ బోగీలోకి ఎక్కారు. ఆరుగురు సభ్యులున్న వీరు ఒకేసారి బోగీలోకి రావటంతో టీసీ ప్రశ్నించాడు. జనరల్ టికెట్ తీసుకుని ఏసీ బోగీలోకి ఎలా వస్తారని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో టిసికి,వీరికి మధ్య వాగ్వాదం జరిగింది.

జనరల్ టికెట్ తీసుకుని ఏసీ బోగీలోకి ఎక్కింది నిజమే అని.. అయితే ఫైన్ రాసుకోవాలి కానీ.. ఇష్టమొచ్చినట్లు టీసీ తిట్టాడని చెబుతున్నారు షేకింగ్ శేషు. వీరి వాదనతో టీసీ విబేధిస్తున్నాడు. పెద్ద పెద్ద అరుపులు, కేకలతో వచ్చారని.. మిగతా ప్రయాణికులతో కూడా దురుసుగా ప్రవర్తించారని చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నాపైనే జబర్థస్త్ సెలబ్రిటీలం అంటూ హంగామా చేశారని టీసీ అంటున్నారు..టిసి చెప్తున్నదానికి ఏకీభవిస్తూ ఒక ప్రయాణికుడు వారు ట్రెయిన్లో నానా హంగామా చేశారని మేం సెలబ్రిటిలం అని పెద్దపెద్దగా కేకలు పెట్టారని చెప్పారు..

జబర్ధస్త్ టీం – టీసి మధ్య వివాదం..ఆ గొడవ గురించి ఎవరేం చెప్పారో మీరే చూడండి.

Watch video :

https://youtu.be/5nJ00GW1C80

Comments

comments

Share this post

scroll to top