“జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. లేడీ గెటప్ లో తన పెర్ఫార్మన్స్ తో “చమ్మక్ చంద్ర” టీంలో ఆక్ట్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు “వినోద్”. అసలు చాలా మంది అతను లేడీ గెటప్ లేకుండా ఎలా ఉంటాడో చూడలేదు. ఇప్పుడు అనుకోకుండా దురదృష్టపుశాత్తు “ఆత్మహత్య” ప్రయత్నం చేసుకున్నాడు “వినోద్”. అదృష్టంకొద్దీ అతని ప్రాణాలకు ఏమవ్వలేదు. కానీ అతను ఆత్మహత్య చేసుకోడానికి కారణం ఏంటో వివరాలు చూడండి!
వినోద్ కు సోమవారమే తమ కుటుంబ సభ్యులందరు కలిసి బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించారు. కర్నూలు జిల్లాలోని సంజామల మండలం బొందలదిన్నెలోని ఓ చర్చిలో పెళ్లి చేసేందుకు యత్నించడంతో వినోద్ తన చేతిని గాయపర్చుకున్నాడు. ముందు నుండి పెళ్లి వద్దు అనే అంటూ ఉన్నాడు వినోద్. వినోద్ ఇలా చేయడంతో పెళ్లి రద్దు చేసారు. వినోద్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ స్వస్థలం కడప అని తెలిసింది.