జబర్దస్త్ లో రోజాకు బదులు మంచులక్ష్మీ రాబోతున్నారా? ప్రోమో చూస్తే అదే అనిపిస్తుంది.

ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ కు రోజా గుడ్ బై చెబుతున్నారనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మళ్లీ రోజా జడ్జ్ గా కనిపించడంతో  అవన్నీ ఉత్త మాటలే అని అందరూ కామ్ అయిపోయారు. అయితే తాజాగా ఈ టివి వారు రిలీజ్ చేసిన  జూన్ 9  జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమోలో రోజాకు బదులుగా నాగబాబు పక్కన మంచు లక్ష్మీ జడ్జ్ స్థానంలో కూర్చున్నారు. ఈ ప్రోమో విడుదల తర్వాత మళ్లీ రోజా జబర్దస్త్ కు దూరమయ్యారు అనే టాక్ వినిపిస్తుంది.

అయితే గతంలో రోజా స్థానాన్ని మీనా తో కానీ, రమ్యకృష్ణతో కానీ భర్తీ చేస్తారనే టాక్ వినిపించింది. ఇప్పుడు సడెన్ గా మంచులక్ష్మిని రోజా స్థానంలో చూసి అవాక్కవుతున్నారు జనాలు. నాగబాబు, రోజాల జడ్జ్ మెంట్…..ఈ ప్రొగ్రామ్ కి పర్పెక్ట్ జోడి, వి వాంట్ రోజా ఆన్ జబర్దస్త్ అని కామెంట్స్ చేస్తున్నారు జబర్దస్త్ ప్రేమికులు.  పొలిటికల్ పరంగా రోజాకు జబర్దస్త్ ఇబ్బందిగా మారినట్టు కూడా అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించి  బలమైన కారణాలే వినిపిస్తున్నాయి.  రోజాను విమర్శించే ప్రతి సమయంలోనూ ఈ షోను బేస్ చేసుకునే ప్రత్యర్థి పార్టీల వారు విమర్శించడంతో…రోజా ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. MLA గా ఓ బాధ్యతాయుత పదవిలో ఉన్న రోజా జబర్దస్త్ ప్రతి షో ఎంట్రీకి ముందు డాన్స్ చేయడం…… అడల్ట్ కామెడీని ఎంకరేజ్ చేస్తున్నారనే ఆరోపణలు….అటు ప్రతిపక్షపార్టీనుండే కాక….స్వంత పార్టీ నుండి కూడా రోజాను ఈ కారణాలను చూపుతూ కార్నర్ చేస్తున్నారట….దీనిని అధిగమించేందుకు రోజా జబర్థస్త్ ను వదిలివెళుతున్నారని టాక్ నడిచింది.

మంచులక్ష్మి  ఈ ఒక్క షోకే జడ్జ్ గా వ్యవహరిస్తారా? లేక టోటల్ జబర్దస్త్ షోకా అనేది ఇంకా తెలిసి రాలేదు.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top