ఇప్పటివరకూ సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే మహిళలకే లైంగిక వేధింపులు అని విన్నాం.కానీ పురుషులకు కూడా ఆ వేదింపులు తప్పవ్ అని..నాకు అలాంటి తిప్పలు తప్పలేదు అంటున్నారు జబర్దస్త్ ఫణి..జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయి సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్న కమెడియన్స్ లో ఫణి ఒకరు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినిమా ప్రయాణం గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు ఫణి..
జబర్దస్త్ ఎందరో కమెడియన్స్ ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది..వారందరూ మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు.ఒకవైపు జబర్దస్త్ పట్ల ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ షో నిరాటకంగా సాగుతుంది.మరోవైపు సినిమాల్లో కూడా అదే ధోరణిలో కామెడి సాగుతుంటే అవసరమా జబర్దస్త్ కమెడియన్స్ అనేది కూడా ఆ మధ్య కాలంలో విన్నాం..ఏదేమైనప్పటికీ సినిమా అవకాశాలు లేని టైంలో కొందరు నటులకు జబర్దస్త్ ఆసరా గా నిలబడింది అనడంలో అతిశయోక్తి లేదు..హైపర్ ఆది వచ్చాకే ఫణి జబర్దస్త్ వదిలేసాడు అనే వార్తలో నిజంలేదు..ఆది నాకు తమ్ముడిలాంటోడు,అలాగే జబర్దస్త్ చూడడం ఇష్టం లేనివారు చూడకండి అంటూ సూటిగా సమాధానాలు చెప్పిన ఫణి..ఒక సినిమా అవకాశం కోసం లేడీ డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ కోరిక తీర్చమన్నారనే విషయాన్ని బైట పెట్టాడు..ఇంతకీ ఏం జరిగిందో ఫణి మాటల్లోనే..
“నాకు ఓ చిన్న సినిమాలో అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి లేడీ ప్రొడ్యూసర్, లేడీ డైరెక్టర్. వాళ్లు అంతా ఒకేనా? అని అడిగారు…… రెమ్యూనరేషన్ ఒకే, డేట్స్ ఓకే అని చెప్పాను. కమిట్మెంట్ కావాలని అడిగారు. కమిట్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేడీ ఆర్టిస్టులను కమిట్మెంట్ అడగటం, వారిని శారీరకంగా వాడుకోవడం గురించి విన్నాను. కానీ మగాళ్లను కూడా ఇలా అడుగుతున్నారని తెలిసి షాకయ్యాను. దీంతో ఆ సినిమాను వదిలేసుకున్నాను. దీన్ని బయటపెడితే నీ సంగతి చెబుతాం అంటూ బెదిరించారు కూడా. ఆ విషయం జరిగి చాలా కాలం అయింది కాబట్టి ఇపుడు బయట పెడుతున్నాను” అని ఫని తెలిపారు.