గెటప్ శ్రీను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడో తెలిస్తే కన్నీళ్లాగవు.! అన్నపూర్ణ స్టూడియోలో అవమానం.!

ఏదన్నా వస్తువుని ఎక్కడ పడేసుకుంటే అక్కడే వెతుక్కోవాలని అంటుంటారు.. గెటప్ శ్రీనూ అదే చేశాడు..ఎక్కడైతే అవమానాన్ని ఎదుర్కొన్నాడో అక్కడే విజేతగా నిలిచాడు..ఒకప్పుడు అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న శ్రీనూ నిలదొక్కుకుని జీవితంలో విజయం సాధించాడు..జబర్దస్త్ ఎందరికో అన్నం పెట్టిన అవకాశాలు కల్పించిన షో..అలాంటివాల్లల్లో గెటప్ శ్రీనూ ఒకరు.తన నటనతో,కామెడితో ఆకట్టుకున్నాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి చెప్తూ ఒక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంఘటన గుర్తు చేసుకున్నారు ..

‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా గెటప్ శీనుకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఆయన మరొకొన్ని షోస్ చేస్తూ బిజీ అయ్యాడు.“మా అమ్మానాన్నలకు ఇండస్ట్రీ అంటే ఏమిటి? .. సినిమాలంటే ఏమిటి? అనేది తెలియదు. వ్యవసాయము .. ఊరే వాళ్ల ప్రపంచం” .అన్నయ్యే నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించాడు.అప్పట్లో అప్పులపాలైపోయి.. మధ్యలోనే చదువు ఆపేసిన పరిస్థితి. అప్పులు తీర్చాలంటే.. సంపాదించాలి.. అందుకోసమే హైదరాబాద్ వచ్చాను..ఇక్కడ ఏదన్నా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు,సినిమా అవకాశాలు వెతుక్కోవచ్చని వచ్చేశానని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు..

ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో  అవమానం ఎదుర్కొన్నాను. తెలిసిన ఫ్రెండ్ ద్వారా షూటింగ్ చూడ్డానికి వెళ్తే ఎవరు పిలిస్తే వచ్చావంటూ తిట్టారు,చేతిలో తింటున్న ప్లేట్ లాక్కున్నారు అవమానం భరించలేక వారం రోజులు ఏడ్చేశా. ఇప్పుడు అదే అన్నపూర్ణ స్టూడియోస్ లో జబర్దస్త్ షూట్ జరుగుతుంది.వేణు తో పరిచయమే జబర్దస్త్ వైపు వచ్చేలా చేసింది. నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో. ఆడిషన్ వెళ్లాను, సెలక్టయ్యాను. తేజగారు రెండోసారి నన్ను టెస్ట్ చేస్తుంటే….ఏదో ఆలోచిస్తున్నావన్నారు. లేదు సార్ చేయడం లేదు అన్నాను. నువ్వు ఇపుడే ఇలా సమాధానం చెబుతున్నావ్ రేపు సినిమాలో కష్టం అని రిజక్ట్ చేశారు. వెళ్లిపో అన్నారు. ట్యాంక్ బండ్ వెళ్లిపోయి బుద్దున్ని చూస్తూ అలా ఉండిపోయాను. దూకేద్దామా? చచ్చిపోదామా? ఏం చేద్దాం అలా ఉండిపోయాను.జీవితంలో తాను పడిన కష్టాలకంటే సినిమా కష్టాలు ఏమంత పెద్దవి కాదని, చివరకు ఆలోచన విరమించుకున్నాను.కటిక పేదరికాన్ని,కష్టాల్ని ఎదురీది ఇఫ్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని గెటప్ శ్రీను తెలిపారు…

Comments

comments

Share this post

scroll to top