చందమామ కథలు వంటి జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఈయన డైరెక్షన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు టాకీస్’. గుంటూర్ స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. చాలా రోజుల నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన 30 సెకన్ల నిడివిగల టీజర్ ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. ‘జబర్దస్త్’ ఫేం రేష్మి, యంగ్ హీరోయిన్ శ్రద్దాదాస్, నరేష్, సిద్ధూ, జొన్నలగడ్డ ప్రధానపాత్రలలో నటించారు. చిత్ర టీజర్ లో టూ ఇడియట్స్ గా నరేష్, సిద్ధులను పరిచయం చేశాడు. సిద్ధూ అమ్మాయిలను ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ పోషించగా, సిద్ధూతో అఫైర్ ఉన్న అమ్మాయిలుగా అందాలతో అలరిస్తున్నారు రేష్మి, శ్రద్ధాదాస్.
ఆర్.కే. స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ కుమార్ ఎం.నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు. మరో మూడు రోజుల్లో ‘గుంటూర్ టాకీస్’ ట్రైలర్ రిలీజ్ కానుంది.
Watch Guntur Talkies Teaser: