నన్ను, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు అంటూ ట్వీట్ చేసిన అనసూయ.!

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ కి గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతున్న యాంకర్ అనసూయ.  అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకెళుతున్న అనసూయ అటు వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.సుకుమార్ ,రాంచరణ్ కాంభినేషన్లో వస్తున్న రంగస్థలం సినిమాలో అనసూయ మంచి రోల్ పోషిస్తుందన్న విషయం తెలిసిందే..అయితే రిపబ్లిక్ డే రోజు  విషెష్ చెబుతూ  అనసూయ చేసిన  ట్వీట్  సంచలనం అయింది..ఇంతకీ తనేం ట్వీట్ చేసిందంటే..

డియర్ ఇండియా అంటూ…. ఈ దేశంలో, సమాజంలో ఇంకా మారని పరిస్థితులపై గళమెత్తింది అనసూయ.‘డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను…. నేను చేసే పని, నేను ధరించే దుస్తుల వల్ల నా కుటుంబం ఇబ్బంది గా ఫీలవ్వడం లేదు. ఇవి వారిపై ఎలాంటి ప్రభావం చూడం లేదు. కానీ బయటి వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నాతో పాటు నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు, అమర్యాదగా, అగౌరవంగా వ్యాఖ్య చేస్తూ మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు .ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ నన్ను వేధిస్తున్నారు. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు….. అంటూ అనసూయ ట్వీట్ చేసింది.అంతేకాదు…

బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.స్వేచ్ఛకు అర్థం ఇదేనా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? అంటూ ఆ ట్వీట్లో… అనసూయ మండిపడింది. సంస్కృతీసంప్రదాయాల పేరిట నా భావాలను, గౌరవాన్ని అణగదొక్కే స్వేచ్ఛ ఈ అవివేకులకు ఉందా? నేను ఇలాగే జీవించాలా? ? ఏమీ చేయలేమా??’ అంటూ అనసూయ తన మనసులోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

Comments

comments

Share this post

scroll to top