“ఇవాంక”కు “ప్రధాని మోదీ” ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా..? అదెక్కడి నుండి తెప్పించారంటే..?

గతవారంరోజులుగా అటు సోషల్ మీడియాలోను,ఇటు వార్తల్లోనూ వినిపిస్తున్న,కనిపిస్తున్న ఏకైక పేరు ఇవాంక ఇవాంక ఇవాంక… గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు వ్యక్తిగత సలహాదారు, కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.దీని కోసం ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..ఇవాంకకు ప్రత్యేక బహుమతులు,ప్రత్యేక విందు ఏర్పాట్లు కూడా జరిగాయి.

ఇవాంక రాక నేపధ్యంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను అందంగా ముస్తాబు చేసింది. ముఖ్యంగా ఆమె పర్యటించే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫలక్‌నూమా ప్రాంతాల్లో రోడ్లు కొత్త రంగులద్దుకున్నాయి..రాష్ట్ర ప్రభుత్వం ఇవాంకకి ఇవ్వడానికి ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేసింది.వాటిల్లో ప్రఖ్యాత గొల్లబామ చీర ఉండడం విశేషం..ఈ చీరని చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంతా స్వయంగా ఇవాంకకి ఇవ్వనున్నారు.దీంతో గొల్లభామ వార్తల్లో నిలిచింది..మరోవైపు మన ప్రధాని మోడి ఇవాంకకి ప్రత్యేక కానుక అందించారు..అదేంటంటే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సాదేలీ రకానికి చెందిన రేఖాగణిత పునారావృత నమూనాలతో కూడిన మైక్రో మోజాయిక్ బాక్స్‌.. అత్యంత నైపుణ్యంతో తయారుచేసే ఈ బాక్స్‌ ను ప్రధాని సూరత్ నుంచి తెప్పించి ఇవాంకకు ఇచ్చారు.

Comments

comments

Share this post

scroll to top