చివరగా హైదరాబాద్ లో “గోల్కొండ” చూసిన “ఇవాంక”…ఏమని పోస్ట్ పెట్టిందో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ జీఈఎస్ 2017 సమ్మిట్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చి వెళ్లిన విషయం తెలిసింది.తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయినప్పటి నుండి ఆమె తన అనుభవాలను ట్విటర్లో ట్వీట్ చేస్తూనే ఉన్నారు..ఈ సమ్మిట్ లో అమెరికా బృందానికి ప్రాతినిద్యం వహించింది ఇవాంక..ఇక్కడ రెండు రోజుల పాటు సమావేశాల్లో పాల్గొంటూ మధ్యలో ఫలక్ నుమా ఫ్యాలెస్ లో ప్రధాని ఇచ్చినవిందులో పాల్గొంది..హైదరాబాద్ పర్యటన చివరిలో గోల్కోండని సందర్శించారు ఇవాంక..దీనిపై ఇవాంక పెట్టిన ట్వీట్ నెటిజన్లను ఆకర్శిస్తుంది..ఇంతకీ ఇవాంక ఏమని ట్వీట్ చేశారో తెలుసా…?


హైదరాబాద్ పర్యటన ముగింపులో ఆమె గోల్కొండకోటలో ఆయుధగారం, రాణీమహల్‌ ప్రాంగణం, అక్కన్న, మాదన్న కార్యాలయాలను ఆమె సందర్శించారు. సుమారు యాభై నిమిషాలపాటు కోటంతా తిరిగి ఆసక్తి గా గమనించారు..అక్కడి గైడ్స్ ను కోట గురించినవిషయాలు అడిగి తెలుసుకున్నారు ఇవాంక .  అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత ఇవాంకా ట్రంప్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ను నుంచి వచ్చే ముందు గోల్కొండ కోటకు వెళ్లాను. కొంతమంది అమెరికా ప్రతినిధులతో కలిసి కోటలో పర్యటించా. హైదరాబాద్ పర్యటనకు పరిపూర్ణమైన ముగింపు ఇదేనని గోల్కొండ కోటను చూశాక అనిపించిందని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Comments

comments

Share this post

scroll to top