నా కల నిజం అవుతుందనే ఆశ నాలో చావదు: ఇట్లు మీ లైలా.

రంగుల ప్రపంచంలో…తన కంటూ ఓ అందమైన జీవితాన్ని ఊహించుకున్న ఓ యువతి  బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టివేయబడుతుంది. చెరిపినా చెరగని గతం, ఆశపడినా అందని జీవితం, ఇక నాకు మిగిలింది ఈ చీకటే అనుకుంటూ ఆత్మహత్యకు సిద్దమౌతుంది. కానీ ఏ మూలనో…తన కల నిజం అవుతుందనే బలమైన నమ్మకంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఇది సింపుల్ గా ఇట్లు మీ లైలా…అనే షార్ట్ ఫిల్మ్ స్టోరి.

ఈ షార్ట్ ఫిల్మ్ లో  కనిపించే విజువల్స్ వెనక కనిపించని ఎన్నో భావాలను ఆవిష్కరించారు.  కుట్టు మిషిన్ పెట్టుకోడానికి, సాని కొంపకు లొంగిపోడానికి మధ్య ఉన్న ఊగిసలాటలో వీళ్లకు కావాల్సింది….శరీరాన్ని తాకట్టు పెట్టకుండా కూడా బ్రతకొచ్చు అనే చిన్న ఆశ, కాస్తంత మనోధైర్యం అనే లైన్ అక్షరాల నిజం.

  • అయితే…. చెప్పాలనుకున్న బలమైన  విషయాలను టెక్ట్స్ రూపానికే పరిమితం చేసి, విజువల్ గా తెరకెక్కించకపోవడం ఈ షార్టీలో కనిపించిన మైనస్ పాయింట్.
  • విద్యార్థినిగా, ప్రేమను ఆస్వాధిస్తున్న ప్రియురాలిగా, ఆత్మహత్యకు సిద్దమైన ఓ వ్యభిచారిణిగా…… మూడు సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంది ఇందు కుసుమ.
  • ఓ మహిళగా మహిళల కష్టాలకు దృశ్యరూపమిచ్చిన డైరెక్టర్ శ్రీవిద్య ను అభినందించాల్సిందే.

Watch Itlu Mee Liala Short FIlm:

Comments

comments

Share this post

scroll to top