ఇతను MBBS స్టూడెంట్..గతేడాది కాలేజ్ టాపర్. అయినా రోజూ ఆటో నడుపుతాడు,ఎందుకో తెలుసా.?

హాస్పిటల్ లో అడ్మిట్ అయిన స్నేహితుడి అమ్మను చూడడానికి ఆటోలో బయలు దేరాడు ఓ పెద్ద మనిషి.. అతనికి బ్యాక్ పెయిన్ ఉండడంతో  ఆటో డ్రైవర్ ను కొంచెం నిదానంగా తీసుకెళ్ళమని చెప్పాడు, సరే సార్ అని ఆ  బదులిచ్చాడు డ్రైవర్.ఆటో హాస్పిటల్ కు  చేరుకుంది, ఆటో నుండి దిగి, ఎంతైంది బాబు అని అడగ్గా.. మీరు ఈ ఆటోలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి ఉంటే మీకు తోచినంత ఇవ్వండని  పక్కకు తిరిగి ఒక బాక్స్ వైపు చూశాడు. ఆ బాక్స్ కింద ” వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక రోగాలతో బాధపడుతున్న పేద ప్రజలకొరకు” అని  కింద రాసి ఉంది.

సరేనని ఓ 150 రూపాయలు ఆ బాక్స్ లో వేసి ముందుకు కదిలాడు ఆ పెద్దమనిషి.. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఆ ఆటో నడిపే కుర్రాడికి నమస్తే సార్ .. అని చెప్పాడు. దానికి ఆ కుర్రాడు కూడా నమస్తే తాత అని చెప్పి ఆటో మలుపుకొని  వెళ్లిపోయాడు. ఆ ఆటో కుర్రాడు వెళ్లిపోయాడు కానీ ఆ పెద్దమనిషి ఆలోచనలన్నీ అతని చుట్టే తిరుగుతున్నాయ్.. దానికి తోడు ఈ సెక్యురిటీ గార్డ్ నమస్తే అనడం అతను దానికి తాతా నమస్తే అని ప్రతి నమస్కారం చేయడం..అతడి ఆలోచనలు ఇంకా తీవ్రతరం చేశాయి.
auto-750x500
అతని గురించి తెలుసుకోవాలిని…. సెక్యురిటీ గార్డ్ తో… ఇతను ఎవరు..? మీరెందుకునమస్కారం చేశారు..?
” సార్ ఆ అబ్బాయి ఈ మెడికల్ కాలేజ్ లో మూడవ సంవత్సరం డాక్టర్ కోర్స్( MBBS)  చేస్తున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఇలా ఆటో నడుపుతూ వైద్యం చేయించుకోలేని వారికి తనకు వచ్చే ఆటో డబ్బులతో వైద్యం చేయిస్తున్నాడు. నలుగురు పిల్లలు కలిగిన అతడి కుటుంబంలో ఈ అబ్బాయి రెండవ కుమారుడు. వాళ్ళ నాన్న కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు, వాళ్ళ అన్నయ్య పక్షవాతంతో మంచాన ఉన్నాడు. ఇంకా తన ఇద్దరు చెల్లెలను తనే చూసుకుంటున్నాడు. గతేడాది పరీక్షలలో  మంచి ఉత్తీర్ణత సాధించినందుకు గానూ మెడికల్ సూపరిండెంట్ సాయంతో ఆటోను తీసుకొని, చదువూ, ఆటో నడుపుతున్నాడు.
మెడికల్ కాలేజ్ కి వైద్యం కోసం వచ్చే వారిని ఉచితంగా తన ఆటోలోనే  తీసుకువస్తాడు, ఎవరైనా డబ్బులిస్తే ఆ బాక్స్ లో వేయమని చెబుతాడు. ఇలా వచ్చిన ద్వారా ప్రతి నెలాఖరున ఎవరైతే వైద్యం కోసం ఎదురుచూస్తున్నారో వారికి వైద్యం చేయిస్తాడు. ఆటో కొనడానికి సాయం చేసిన సూపరిండెంట్ కు డబ్బులు ఇవ్వడానికి అతను వెళ్ళగా,నువ్వు చేసే  సహాయంతో  పోల్చుకుంటే నేను చేసిన సాయం చాలా  చిన్నది..ఆ డబ్బులు వద్దులేరా అని తిరస్కరించాడు.” అని సమాధానం ఇచ్చాడు. ఇది విన్న ఆ పెద్దమనిషి…ఈ రోజుల్లో కూడా ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారా ? అంటూ ఆశ్చర్యపోయారు.
పక్కోడి గురించి మనకెందుకులే..మన సంసార సాగరాన్ని మనం ఈదితే చాలులే అనుకుంటున్న ఈరోజుల్లో… ఇతని సేవ దృక్పధాన్ని చూస్తుంటే…. ఫాథర్ థెరెస్సా అనే పేరు కరెక్ట్ గా సూట్ అవుతుందేమో..!

Comments

comments

Share this post

scroll to top