ఏక‌ప‌క్ష దాడుల‌పై ఆగ్ర‌హం..మోదీ తీరుపై గ‌రం గ‌రం

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం విప‌క్షాల‌కే కాదు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్క‌రున్నా..ఏ పార్టీ అయినా స‌రే టార్గెట్ చేస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా 543 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో జ‌రుగుతున్నాయి. మొద‌టి విడ‌త పూర్త‌యింది. రెండో విడ‌త‌లో భాగంగా త‌మ‌తో క‌ల‌వ‌ని పార్టీల‌పైనే గురి పెట్టారు క‌మ‌ల‌నాథులు. మోదీ, అమిత్ షా కేసులు న‌మోదు చేయించ‌డం, ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థులు, అధిపతుల‌ను లక్ష్యంగా చేసుకునేలా ఐటీ దాడుల‌ను ప్రోత్స‌హించ‌డం జ‌రుగుతోంది. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన విప‌క్షాలు మోదీ తీరుపై మండిప‌డుతున్నాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలాంటి ఏక‌ప‌క్ష దాడుల‌ను స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఏపీలో మాజీ కేంద్ర మంత్రి సీఎం రమేష్ ఇళ్ల‌పై ఐటీ శాఖ దాడులు చేసింది. ఎలాంటి కీల‌క ఆధారాలు ల‌భించ‌లేదు. తాము ఆదాయ ప‌న్ను చెల్లిస్తున్నామ‌ని ..మోదీ కావాల‌నే త‌మ‌ను టార్గెట్ చేశారంటూ ర‌మేష్ ఆరోపించారు.

క‌ర్ణాట‌క‌లోను..ఇటు త‌మిళ‌నాడులోను ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు భారీ ఎత్తున సోదాలు చేశారు. పోలింగ్‌కు కేవ‌లం 36 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ఇలా దాడులు చేయ‌డం చ‌ట్ట విరుద్ద‌మంటూ స్టాలిన్, క‌నిమొళి నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు మొద‌టి నుండి మోదీ ఏక‌ప‌క్ష ధోర‌ణిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ బంధువుల ఇళ్ల‌లోను సోదాలు నిర్వ‌హించారు. న‌టి సుమ‌ల‌తకు మ‌ద్ధ‌తు ఇచ్చే న‌టుడి ఇంట్లోను వెదికారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాట‌కంలో భాగంగానే త‌మ‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకున్నారంటూ విప‌క్షాలు ఆరోపించాయి. జేడీఎస్ ఇళ్ల‌ల‌ను..క‌ర్ణాట‌క‌లోని ప‌లు చోట్ల త‌నిఖీలు చేప‌ట్టారు. కాగా ఐటీ శాఖ అధికారుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ బ‌ల‌గాలు వుండ‌డం మ‌రింత అనుమానాల‌కు తెర తీసింది.

ఎన్డీయే కూట‌మికి వ్య‌తిరేక శిబిరంలో ఉన్న నేత‌లు, వారి బంధువులు, స‌న్నిహితులు, మ‌ద్ధ‌తుదారుల జాబితా ఆధారంగా బీజేపీ కేంద్రం నుండి ఐటీ ద్వారా దాడులు చేయిస్తోందంటూ స్టాలిన్ విమ‌ర్శించారు. డిఎంకే అధ్య‌క్షుడు స్టాలిన్ సోద‌రి క‌నిమొళి ఇంట్లో త‌నిఖీలు చేప‌ట్టింది. క‌ర్ణాట‌క‌లో దేవ‌గౌడ ఇంటితో పాటు ప‌లువురు జేడీఎస్ నేత‌ల ఇళ్ల‌ను టార్గెట్ చేసింది. మ‌రో వైపు దిన‌క‌ర‌న్ పార్టీ ఆఫీసులో ఈసీ బృందం సోదాలు చేయ‌గా..50 ల‌క్ష‌ల రూపాయ‌లు దొరికాయి. లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన వేళ‌..ప్ర‌తిప‌క్ష డిఎంకేకి ఈసీ, ఐటీ వ‌రుస‌గా షాక్‌ల మీద షాకులు త‌గిలాయి. వేలూరు లోక్ స‌భ ఎన్నిక‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ఈసీ ప్ర‌క‌టించింది. తూత్తుకుడి లో బ‌రిలో ఉన్న క‌నిమొళిని టార్గెట్ చేయ‌డంతో ఆందోళ‌నకు గుర‌య్యారు స్టాలిన్. విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ ఎత్తున సోదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అక్క‌డికి చేరుకున్నారు. ఎవ‌రినీ లోప‌ల‌కి అనుమ‌తించ‌లేదు. సాయుధ పోలీసుల‌తో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

రెండు గంట‌ల‌కు పైగా ఐటీ, ఈసీ సోదాలు జ‌రిగాయి. రాత్రి 8.30 గంట‌ల స‌మ‌యంలో మా ఇంటి త‌లుపులు త‌ట్టారు. ఈ వేళ సోదా చేసేందుకు మీకు అనుమ‌తి ఉందా అని ప్ర‌శ్నించినా స‌రైన స‌మాధానం వారి నుండి రాలేద‌ని క‌నిమొళి తెలిపారు. ఇదే ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుండి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న సౌంద‌ర రాజ‌న్ ఇంట్లో కోట్లు మూలుగుతున్నాయ‌ని ..తాము ఫిర్యాదు చేసినా ఐటీ అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదంటూ స్టాలిన్ ఆరోపించారు. క‌ర్ణాట‌క‌లో దేవ‌గౌడే టార్గెట్. బెంగ‌ళూరుతో పాటు హ‌స‌న్, మండ్య‌ల్లో 12 చోట్ల సోదాలు చేప‌ట్టింది. దేవ‌గౌడ మ‌నుమ‌డు పాప‌ణ్ణ‌తో పాటు ప‌లువురు జేడీఎస్ కీల‌క నేత‌ల కార్యాల‌యాల‌లో ఐటీ సోదాలు జ‌రిపింది. ప్ర‌ముఖ సినీ న‌టుడు ద‌ర్శ‌న్ ఆఫీసును కూడా వ‌ద‌ల‌లేదు. ప‌న్ను ఎగ‌వేత‌దారులు, న‌ల్ల‌ధ‌నం క‌లిగి ఉన్న వారిపైనే దాడులు చేశామ‌ని ..త‌మ‌కు ఎవ‌రి ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణి అంటూ వుండ‌ద‌ని ఐటీ శాఖ చెప్ప‌డం విశేషం.

Comments

comments

Share this post

scroll to top