సోష‌ల్ మీడియాలో మీరు అస్స‌లు షేర్ చేయ‌కూడ‌నివి ఏంటో తెలుసా..?

ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్‌… ఇలా ఏ సోష‌ల్ మీడియా స‌ర్వీస్‌ను తీసుకున్నా అందులో ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక‌టి ఎడా పెడా షేర్ చేస్తున్నారు. ఫ‌లానా వ్య‌క్తితో ఫొటో దిగాన‌నో, ఫ‌లానాది సాధించాన‌నో, ఏదైనా ప్ర‌దేశానికి వెళ్లాన‌నో, ఎక్క‌డైనా ఉన్నాన‌నో… సందేశం పెడుతూ ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌డం ఎక్కువై పోయింది. అయితే యూజ‌ర్లు త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఏది షేర్ చేసినా ఇప్పుడు చెప్ప‌బోయేవి మాత్రం అస్స‌లు షేర్ చేయ‌కూడ‌ద‌ట‌. ఒక వేళ అలా కాకుండా వాటిని షేర్ చేస్తే చిక్కుల్లో పడిన‌ట్టేన‌ని, క‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్టు అవుతుంద‌ని టెక్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అయితే మ‌నం సోష‌ల్ మీడియాలో అస్స‌లు షేర్ చేయ‌కూడ‌నివి ఏంటి..?   తెలుసుకుందాం రండి..!

social-sharing
డ్రైవింగ్ లైసెన్స్, సోష‌ల్ సెక్యూరిటీ వివ‌రాలు…
డ్రైవింగ్ లైసెన్స్‌, ఓట‌ర్ ఐడీ కార్డ్ వంటి వాటిని సోష‌ల్ సైట్ల‌లో అస్స‌లు షేర్ చేయ‌కూడ‌దు. అలా చేస్తే వాటిలో ఉన్న మీ స‌మాచారాన్ని ఎవ‌రైనా వ్య‌క్తులు దొంగిలించి వాటికి డూప్లికేట్ కార్డులు సృష్టించి దాంతో చ‌ట్ట వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంటుంది. మీ పేరిట ఏదైనా అలాంటి ప‌నిచేస్తే అప్పుడు దానికి మీరే బాధ్యులు కావ‌ల్సి వ‌స్తుంది. అంతేకాదు, ఇలాంటి కార్డుల వివ‌రాల‌తో కొంద‌రు బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకుంటున్నార‌ట‌. క‌నుక అలాంటి కార్డుల‌ను సోష‌ల్ సైట్ల‌లో అస్స‌లు పెట్ట‌కూడ‌దు.

లొకేషన్ వివ‌రాలు…
మీరేదైనా ట్రిప్పుకు రోజుల త‌ర‌బ‌డి వెళ్లార‌నుకోండి. అప్పుడు మీ ఇంట్లో ఎవ‌రూ లేరు. కానీ మీరు మీ ట్రిప్ వివ‌రాల‌ను, మీరున్న లొకేషన్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటే… ఆ వివరాల‌ను తెలుసుకుని ఎవ‌రైనా మీ ఇంట్లో దొంగ‌త‌నం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. లేదంటే వారు మీరున్న లొకేష‌న్‌కు వ‌చ్చి అద‌ను చూసుకుని ఏదైనా ప్రాణహాని కూడా త‌ల‌పెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలాంటి లొకేష‌న్ వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

బ్యాంకు వివ‌రాలు…
కొంద‌రు తాము అందుకున్న చెక్కులు, ఇత‌ర బ్యాంక్ సంబంధిత కార్డుల‌ను ఫొటో తీసి మ‌రీ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే నిజానికి అలా చేయ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం. ఆ చెక్కులు, ఇత‌ర కార్డుల్లో ఉండే స‌మాచారాన్ని ఎవ‌రైనా సుల‌భంగా దొంగిలించి దాంతో వినియోగ‌దారుల అకౌంట్ల‌లో ఉన్న డ‌బ్బులు కాజేస్తారు. ఏదైనా ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డుతారు. క‌నుక అలాంటి సమాచారం కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top