మహానటిలో నటించిన ఈ గడుసు పిల్ల ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు..!

తెలుగులో మహానటిగా, తమిళంలో నడియగయర్ తిలగం గా తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. దర్శక నిర్మాతలు,నటీనటులు,టెక్నిషియన్స్ వరకూ అందరూ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారు ఈ సినిమాకు.నటీనటులు ఎవరి  పాత్రల్లో వారు ఒదిగిపోయి చక్కటి అభినయంతో వాటిని పండించారు.సావిత్రి పాత్ర పోషించిన కీర్తి నటనైతే సావిత్రే తిరిగొచ్చిందా అని ఆశ్చర్యపోయేంత అద్భుతంగా నటించింది.చివరికి సావిత్రి చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి  సైతం అదరగొట్టేసింది.తన చలాకీ నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఆ చిన్నారి ఎవరనుకుంటున్నారు..

మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్ర పోషించిన పాప పేరు నిశంకర సావిత్రి.. నటుడు రాజేంద్రప్రసాద్ కి స్వయానా మనవరాలు ఈ అమ్మాయి.ఇదే సినిమాలో కేవీ చౌదరిగా కీలక పాత్ర పోషించారు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.అంటే మనవరాలే ఆయనకు ఇందులో కూతురి వరసలో నటించింది. ఈ అమ్మాయి తన తాతయ్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘మహానటి’లో నటించిన అనుభవం గురించి ఏమని చెప్పిందో తెలుసా… ‘‘నాగ్ అశ్విన్ అంకుల్.. స్వప్న ఆంటీ మా తాతను కలవడానికి మా ఇంటికొచ్చారు. నేను నా కుక్కతో వాళ్లను ఒకసారి భయపెట్టాను. వాళ్లకు నేను నచ్చాను. నన్ను ఈ సినిమాలో నటింపజేయొచ్చా అని మా తాతయ్యను అడిగారు. ఆయన ఓకే అనడంతో ఈ సినిమా చేశాను…అంటూ చెప్పుకొచ్చింది..

కెమెరా ముందు భయం వేయలేదా అని అడగితే ” నాకు కెమెరా ముందు నటించడానికి భయం వేయలేదు.మా తాతయ్య నుంచి యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చూసి వాటిలోని డైలాగుల్ని చెప్పడం.. కొన్ని సన్నివేశాలు నటించి చూపించడం తరచుగా చేస్తుంటా’’ అని  అంది. ఇంతకీ నీకు సావిత్రి అంటే ఎవరో తెలుసా అని అడిగితే తెలియదని చెప్పిన ఆ అమ్మాయి.. సినిమా రిలీజయ్యాక ఆమె గురించి తనకు కొంచెం అర్దమైంది అంటూ చెప్పింది ఈ చిచ్చరపిడుగు..తాత బుద్దులు ఎక్కడికిపోతాయి..సినిమాలోనూ అల్లరే,బయట కూడా అల్లరే..

Comments

comments

Share this post

scroll to top