కాస్తంత తార్కిక జ్ఞానం అలవర్చుకుని.మెదడుకు కొంత పని పెడితే దర్జాగా కాలరెగరేసుకుని బతికేయొచ్చు. ఎంచక్కా వేల రూపాయల కంటే లక్షలు కొట్టేయొచ్చు. కావాల్సిందల్లా అలుపెరుగని శ్రమ. డిఫరెంట్ గా ఆలోచించడం. సొసైటీని ప్రభావితం చేస్తూ పది మందికి దారి చూపించగలిగే సత్తా మీకుంటే ఇంకేం కంపెనీలు పిలిచి పిల్లను ఇవ్వక పోవచ్చు కానీ.భారీ ఆఫర్లతో మీకు ఘన స్వాగతం పలుకుతాయి. ఇండియాలో సీన్ మారింది. యువతీ యువకులు ప్రభుత్వ కొలువులంటేనే జడుసుకుంటున్నారు. ఏకంగా ప్రైవేట్ కంపెనీలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అత్యధిక శాతం స్టూడెంట్స్ ఎంచుకుంటున్నారు. తక్కువ వయసులోనే ఎక్కువ వేతనాలు అందుకునేలా తమకంటూ ఓ విజన్‌తో ముందుకెళుతున్నారు.
సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4తో పాటు ఆయిల్, ఏవియేషన్, రైల్వే, పోస్టల్, ఆర్మీ, హోం , పార్లమెంటరీ , మైనింగ్, లాజిస్టిక్, టెలికాం , రక్షణ రంగాలలో లక్షలాది కొలువులు కొలువుతీరి ఉన్నాయి. వీటికి రాను రాను అప్లయి చేసుకోవడం మానేశారు. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతూ కోట్లాది మంది యూత్ కు భరోసాను కల్పిస్తోంది. దీంతో ఒకరికింద ఎందుకు పనిచేయాలంటూ .స్వంతంత్రంగా తమకు తామే బాస్‌లుగా ఉండే ఐటీ జాబ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్, సైన్స్ గ్రూప్‌లను ఎంపిక చేసుకుంటున్నారు స్టూడెంట్స్.
వేలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. మెడికల్, డెంటల్, హెల్త్ , టెలికాం, మేనేజ్ మెంట్ , ఏవియేషన్ , రక్షణ రంగాలకు సంబంధించిన కోర్సులను చదువుతున్నారు. బిఇ, బిటెక్, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ లాంటి కోర్సులకు డిమాండ్ పెరిగింది. వీటితో పాటు పాలిటెక్నిక్, వ్యవసాయ కాలేజీలు ఏర్పాటవుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ తో పాటు డిజిటల్ టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. సాఫ్ట వేర్ , హార్డ్ వేర్ రంగాలలో కొద్దిగా పట్టు సాధించగలిగితే లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. ఐటీ పరంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తోంది. అమెరికా నుండే ఐటీ కంపెనీలకు ఎక్కువగా కాంట్రాక్టులు దక్కుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, విప్రో, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, టెక్ మహీంద్ర , క్యాప్ జెమిని, తదితర కంపెనీలన్నీ యుఎస్ తో అనుసంధానమై ఉన్నాయి. 80 శాతానికి పైగా అక్కడి నుంచే కార్యకలాపాలు సాగుతున్నాయి. బిపిఓ, కేపీఓ లాంటివన్నీ వీటితోనే అనుసంధానమై ఉన్నాయి.
అమెరికాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగపూర్, చైనా, జపాన్, మలేషియా, బ్యాంకాక్, ఫ్రాన్స్, ఇంగ్లండ్ , తదితర దేశాలు ఐటీపైనే ఆధారపడ్డాయి. ఇన్సూరెన్స్, టెలికాం, హెల్త్ కేర్, మేనేజ్ మెంట్ , ఫైనాన్స్ రంగాలలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వీటిపైనే కాన్సంట్రేషన్ చేయగలిగితే ఉన్న చోటనే కొలువు సంపాదించవచ్చు. విమానయాన రంగంలో ఎయిరోస్పేష్ ఇంజనీర్, అగ్రికల్చరల్ , ఆటోమోటివ్ , బయోమెడికల్ , కెమికల్ , సివిల్ , కంప్యూటర్ ఇంజనీర్, డ్రాఫ్టింగ్ అండ్ డిజైనర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్, జియోలాజికల్, మెరైన్, ఎన్విరాన్ మెంటల్ , మెకానికల్, పెట్రోలియం, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. సాఫ్ట్ వేర్ టెస్టింగ్ కు ప్రయారిటీ ఉంది.
కొత్త ఏడాదిలో ఐటీ, స్టార్టప్ సంస్థలలో దాదాపు 5 లక్షల కు పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ మోహన్ దాస్ పాయ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. గతంలో కంటే ఈసారి 20 శాతం పెరగనుందని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఐటీ రంగంలో స్దబ్ధత నెలకొనగా ఈసారి ఐటీకి ఊపునివ్వనుంది. అమెరికా హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో దేశీయ ఐటీ దిగ్గజాలు యుఎస్ కు బదులు జపాన్, ఆగ్నేషియా దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. కొత్తతరం ఐటీ కంపెనీలు హైదరాబాద్ ను ఎంచుకుంటున్నాయి. ఇక్కడ మౌళిక సదుపాయాలు పెరగడం, ప్రభుత్వ సహకారం ఎక్కువగా ఉండడం కూడా కారణం. యుఎస్ లో కృత్రిమ మేధ, డిజిటైజేషన్, బిఎఫ్ ఎస్ ఐ , బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో ఐటీ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విభాగాలపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తే మరింత లాభపడవచ్చు. యూరప్, ఆసియా దేశాల్లోనూ కొత్త మార్కెట్లు, దేశీయ ఐటీ కంపెనీలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో స్టార్టప్ సంస్థలకు స్వర్ణయుగం రాబోతోందని ఐటీ దిగ్గజాలు పేర్కొంటున్నాయి.
ఐటీ సంస్థల్లో 2 లక్షలు, అంకుర కంపెనీలలో 5 లక్షలు మొత్తంగా చూస్తే 7 లక్షల ఉద్యోగాలు క్రియేట్ కాబోతున్నాయి. ఇండియాలో ఇప్పటికే 39,000 వేల కంపెనీలు స్టార్టప్ లు ఏర్పాటు కాగా .మరో కొత్తగా 5 వేలు రాబోతున్నాయి. ఏది ఏమైనా వచ్చే కాలం ఐటీ కంపెనీలదేనన్నది వాస్తవం. ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఐటీ కొలువులే బెటర్ అంటూ జనం డాలర్ల జపం చేస్తున్నారు.