#ISupportAmeerkhan అంటూ వైరల్ అవుతున్న అమీర్ ఖాన్ విషయాలు.!

అమీర్ ఖాన్ మాటలపై రచ్చరంబోలా చేస్తున్న మేధావులారా..?  అమీర్ ఖాన్ అసలైన భారతీయుడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన కార్యక్రమాలు చాలు. హీ ఈస్ ట్రూ ఇండియన్ అని చెప్పడానికి. ఆయన చేసిన వ్యాఖ్యలను మనదేశ ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకోవాలే తప్ప…అతనిమీద దేశద్రోహి అనే ముద్రనువేసి, దేశాన్ని వదిలి వెళ్ళిపో..అనేంత పెద్ద పెద్ద మాటలు మన స్థాయివి కావు.ఆయనుకున్న దేశభక్తితో  పోలిస్తే..  ఇప్పుడు బిల్డప్ లు కొడుతున్న వారికి 10 శాతామైనా లేదు.

ఓ సారి అమీర్ ఖాన్ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తది ఆయన దేశభక్తి. 

  • ఆయన భార్య పేరు కిరణ్ రావు( ఓ హిందూ)  ఇది మతాల ఐక్యతకు సంబంధించిన విషయం.
  • మరో విషయం ఏంటంటే మన నిజాం సంస్థానంలోని వనపర్తి రాజా రామేశ్వరావ్ మనవరాలు  కిరణ్ రావ్.
  • వారి కొడుకు పేరు ఆజాద్ రావ్ ఖాన్( ఇది మత గౌరవానికి నిదర్శనం)
  • అమీర్ ఖాన్ ఏ భారతీయ అవార్డు ఫంక్షన్ కు హాజరు కాలేదు, అతని ఉద్దేశ్య ప్రకారం “భారతీయ సినిమా అవార్డులలో విశ్వసనీయత లోపించింది”.అప్పుడు అతని దృక్పధానికి  చప్పట్లు కొట్టిన మనం ఇప్పుడెందుకు విమర్శిస్తున్నాం.?
  • లండన్ లోని  తుస్సుడ్స్ మ్యూజియం వారు స్వయంగా అమీర్ కు ఆహ్వనం పంపి సార్ మీరు రండీ మీ మైనం బొమ్మ చేస్తాం అని చెప్పినా ..అది నాకు అంత ముఖ్యమైనది కాదు అంటూ సున్నితంగా తిరస్కరించిన ఆదర్శవాది.
  • మీకు ఆదర్శమైన మనిషి  ఎవరని  అడగగా, “గాంధీజీ ఒక్కరే నాకు చాలా స్ఫూర్తిని ఇస్తారు. అని అనేక సంరర్భాల్లో చెప్పిన రియల్ హీరో అమీర్.
  • లగాన్ సినిమాతో నిర్మాతగా మారి…. ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపాడు.
  • డేట్స్ లేకున్నా  మంగళ్ పాండే: ది రైజింగ్ (2005)లో నటించి….మన పోరాటపటిమ ఇలా ఉండాలని నిరూపించాడు.
  • లాభాల కోసం కాకుండా పిల్లల కోసం  తారే జామీన్ పర్ సినిమా తీసాడు.
  • సత్యమేవ జయతే అంటూ భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే జరగని గొప్ప సామాజికా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాడు.

అవును….! అన్నాడు భారతదేశంలో అసహనం పెరిగిపోతోందనీ  ఇందులో తప్పేంటి? అసలు ఈ మాటలు ఫస్ట్ అన్నది రాష్ట్రపతి ప్రణబ్ అప్పుడు ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదు? రచయితల ముఖాలకు నల్లరంగు పూసినప్పుడు విమర్శించే వీళ్లంతా ఎక్కడున్నారు? రచయితలు అవార్డులు తిరిగి ఇచ్చినప్పుడు చప్పట్లు కొట్టిన మనం ….అమీర్ వ్యాఖ్యలను ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నాం.

#ISupportAmeerkhan.

Watch Video:

by chantigadu.

Comments

comments

Share this post

scroll to top