బయటి స్నాక్స్ థియేటర్ లోపలికి తీస్కెళ్లనివ్వట్లేదని…ఆమె ఎలాంటి ప్లాన్ వేసిందో తెలుసా.? చూస్తే నోరెళ్లబెడతారు.!

సినిమాకి వెళ్లి మూడు గంటలపాటు కూర్చుని సినిమా చూస్తున్నంత సేపు ఏదన్నా తింటూ సినిమా చూస్తే బాగున్ను అనిపిస్తుంది..బయట కొనుక్కున్నవి ధియేటర్లోకి తీసుకురానివ్వరు..థియేటర్లో కొనుక్కుందామంటే జేబుకి చిల్లు గ్యారంటీ..కాబట్టి ఇంటర్వెల్లో ఏ పాప్ కార్నో కొనుక్కుని దాన్నే ఒక్కోటి మెల్లిగా నములుకుంటూ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అల్ప సంతోషం పొందుతుంటాం..ఇప్పుడు ఆ పాప్ కర్న్ కూడా చాలా ఖరిదే అయింది..సరిగ్గా ఇలాంటి ఆలోచన ఉన్న ఒకామె సినిమా హాల్లోకి తను తినాలకున్న అన్నింటిని తీసుకెళ్లి ఎంచక్కా  తింటూ,సినిమా చూస్తు ఎంజాయ్ చేసింది..ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా…?

లండన్‌కు చెందిన ఏంజిలా బ్రస్క్అనే మహిళ దీనికి సులువైన పరిష్కారాన్ని కనుగొని తన ఐడియాను ట్విట్టర్లో షేర్ చేసింది.ఆమె పోస్టుకు 20 వేలకు మించినలైకులు,40వేలు రీట్వీట్ లు వచ్చాయి..ఇంతమందిని ఆకర్శించేలా ఆమె ఏం చేసిందో తెలుసా…  గర్భవతిగా మేకప్ చేసుకుంది. కడుపు ఎత్తుగా కనిపించేందుకు థర్మాకోల్‌తో ఒక పెద్ద బౌల్ తయారు చేసుకుంది. దానిలో తనకు కావలసిన ఫుడ్‌నంతా ఉంచి, దానిని తన కడుపునకు కట్టేసుకుంది. ఈ విధంగా సినిమా థియేటర్ లోకి ప్రవేశించి ఇష్టమైనవి తింటూ సినిమాను ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చింది.. అయితే ఈ ఐడియా పురుషులకు వర్క్‌అవుట్ అవదు..ఈమెని చూసి పురుషులెవరైనా మగవారికోసం ఏదైనా కొత్త ఐడియా తెస్తారేమో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top