ఐశ్వర్యరాయ్ కి గుంటూర్ లో హెల్త్ కార్డ్.! సచిన్ కు నెల్లూరులో ఓటు హక్కు, సల్మాన్ కు హైద్రాబాద్ లో…?

ఎక్కడో మహారాష్ట్రలో నివసించే సచిన్ టెండుల్కర్ కు నెల్లూరులో ఓటుహక్కు ఉంటుంది, బాలీవుడ్ స్టార్ హీరోగా చలామణి అవుతూ అక్కడే తన కుటుంబంతో చిన్నప్పటి నుండి ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు హైదరాబాదులో ఓటుహక్కు ఉంటుంది. ఇలా ఒక్కసారి రెండుసార్లు మన ప్రభుత్వ అధికారులు చేసే పనికి వాళ్ళకు దిమ్మతిరిగి ఉంటుంది. నేనెప్పుడు అక్కడ ఓటు కోసం అప్లై చేసుకున్నాను అని అవాక్కయి ఉంటారు కూడా. ఇక్కడ నివసించే వారికి సవ్యంగా హక్కులు కల్పించడయ్యా అంటే చేయరు కానీ ఎక్కడో జీవిస్తున్న వారికి మాత్రం ఎక్కడో మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నట్లుగా వారి ఫోటోను ముద్రించిమరీ ఇస్తారు.

Aishwarya-Rai

తాజాగా అలంటి నిర్వాకమే మరొకటి జరిగింది.  మాజీ విశ్వసుందరి, అందాలతార ఐశ్వర్యరాయ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలంలోని గంగులపల్లిలో నివసిస్తున్నట్లు హెల్త్ కార్డ్ జారీచేశారు. ఒకవేళ మనిషి పోలిన మనుషులు ఉన్నారనుకుంటే ఆమె అసలే కాదు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో అనారోగ్యంతో బాధపడే పేదప్రజలకు  కార్పోరేట్ వైద్యం  అందాలనే లక్ష్యంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ ఆరోగ్య పధకాన్ని ఏపీ గవర్నమెంట్ ప్రవేశ పెట్టింది. అందుకుతగ్గ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి కొందరికి ఆ హెల్త్ కార్డులను జారీచేశారు కూడా ఇందులోనే ఐశ్వర్యరాయ్ కు ఏపిలో ఎన్టీఆర్ హెల్త్ కార్డ్ ఉందనే విషయం తెలిసింది. గొల్లపల్లి మండలం గంగులపల్లి తండాకు చెందిన బాణావత్ బాద్యు హెల్త్ కార్డు కు తన ఫోటోలను ఇచ్చి మరీ దరఖాస్తు చేసుకుంది. అయితే తాజాగా ఆ హెల్త్ కార్డ్ ఇంటికి రాగా అందులో పేర్లు అన్నీ కరెక్ట్ గానే ఉన్నా ఫోటోమాత్రం ఐశ్వర్యరాయ్ ది ఉంది.

దీంతో ఆ ఫోటో మాదికాదని షాక్ తిన్న వారు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు కదా ఏదో ఒకటి సర్దిచెప్పుతారు. కంప్యూటర్ లో ఆ విధంగా ఉందనో, మీరు ఇచ్చిన ఫోటో అదేననో, ఇంకా మనం అవాక్కయే కారణాలు చెబుతారు. అదే కార్డ్ పట్టుకొని మనం వెళితే మాత్రం ఈ కార్డ్ లో ఉన్నది నువ్వు కాదు, సరైన కార్డ్ తీసుకురా అని పంపిస్తారు. ఇప్పటికైనా ఈ నిర్లక్ష్యంగా పనిచేయడం మానండి సార్..ఇప్పటికే ప్రభుత్వ అధికారులటే ప్రజలకు నమ్మకం పోయింది, ఇంకా ఇలాంటివి చేసి అప్రతిష్టపాలు కాకండి.

Comments

comments

Share this post

scroll to top