మీ పేరు “R లేదా T” తో మొదలవుతుందా..? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి..!

ప్ర‌పంచంలో ఉన్న మ‌నుషులంద‌రిలో ఎవరి పేరైనా ఏదో ఒక ఆంగ్ల అక్ష‌రంతో ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక మందికి ర‌క ర‌కాల పేర్లు ఉంటాయి. కొంద‌రి పేర్లు ఒక్కోసారి ఒకేలా కూడా ఉంటాయి. మ‌న ద‌గ్గ‌ర శ్రీ‌నివాస్ అనే పేరు చాలా మందికి ఉన్న‌ట్లు విదేశాల్లో డేవిడ్‌, జాన్ అనే పేర్లు చాలా మందికి ఉంటాయి. అయితే ఈ పేర్ల‌న్నింటిలోనూ R లేదా T అనే అక్ష‌రాల‌తో ప్రారంభ‌మ‌య్యే పేర్ల గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. అంటే.. ఈ అక్ష‌రాల‌తో ప్రారంభ‌మ‌య్యే పేర్లను క‌లిగి ఉన్న‌వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుంది, వారి ప్ర‌వర్త‌న‌, ఇష్టాలు వంటివి ఎలా ఉంటాయి తదిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

R లేదా T అనే అక్ష‌రాల‌తో ప్రారంభ‌మ‌య్యే పేర్ల‌ను క‌లిగి ఉండే వారు తులా రాశి కింద‌కు వ‌స్తారు. వీరిది తులారాశి. ఇక వీరు ఎలాంటి వారు అయి ఉంటారో ఇప్పుడు చూద్దాం.

1. ఈ రాశి వారు శాంత మూర్తులుగా ఉంటారు. ఒంట‌రింగా ఉండ‌డం అంటే వీరికి ఇష్టం ఉండ‌దు. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రి తోడును వీరు కోరుకుంటారు. త‌మ‌కు అత్యంత న‌మ్మ‌కంగా ఉండేవారి కోసం వెదుకుతూ ఉంటారు.

2. వీరు స‌హ‌జంగానే ఇత‌రుల‌ను ఆక‌ట్టుకునే వ్యక్తిత్వం క‌ల‌వారు అయి ఉంటారు. వీరికి అంద‌మైన వ‌స్తువులు, ప్ర‌దేశాలు అంటే చాలా ఇష్టం. అంతేకాదు వీరు బాగా రొమాంటిక్ అయి ఉంటారు. త‌మ మాటలు, ప్ర‌వ‌ర్త‌న‌తో ఇత‌రుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంటారు. అంద‌రి ప‌ట్లా బ్యాలెన్స్‌డ్ గా ప్ర‌వ‌ర్తిస్తారు.

3. తులారాశి వారికి స‌మాజ సేవ అంటే ఇష్టం ఉంటుంది. వీరికి స్నేహితులు కూడా ఎక్కువ మందే ఉంటారు. కొత్త వారిని ఎప్పుడూ స్నేహితులుగా చేసుకుంటారు.

4. వీరు ఏ ప‌ని చేసినా దాన్ని బాగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా మెద‌డుకు పదును పెట్టే చాలెంజింగ్ ప‌నులు అంటే ఆసక్తి క‌న‌బ‌రుస్తారు.

5. వీరికి సంగీతం అంటే ఇష్టం. చిన్నారుల‌ను బాగా ద‌గ్గ‌రికి తీస్తారు. త‌మ చుట్టూ ఉన్న ప‌రిస‌రాలు నీట్‌గా ఉండాల‌ని కోరుకుంటారు.

6. ఇత‌రుల ప‌ట్ల ఈ రాశి వారు మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తిస్తారు. పెద్ద‌ల‌ను గౌర‌విస్తారు. స్పోర్ట్స్‌, ఆర్ట్స్‌ అంటే ఇష్టం ఉంటుంది. బయ‌ట తిర‌గ‌డం క‌న్నా ఇంట్లో ఉండ‌డాన్నే వీరు ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తారు.

7. వీరు స‌హ‌జంగానే ఆక‌ట్టుకునే రూపాన్ని క‌లిగి ఉంటారు. చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం అంటే ఆస‌క్తి చూపిస్తారు. జీవిత భాగ‌స్వామి ప‌ట్ల న‌మ్మ‌కంగా ఉంటారు.

8. ఈ రాశి క‌లిగిన స్త్రీలు త‌మ భ‌ర్త‌, పిల్ల‌ల‌ను బాగా చూసుకుంటారు. ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా ఇత‌రుల‌కు స‌పోర్ట్ చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top