ఈ సీసీ ఫుటేజ్ నిర్ధోశిని రక్షిస్తుందో? లేదో చూడాలి. ఆ లారీ డ్రైవర్ జీవితం ఈ సీసీ పుటేజ్ మీదే ఆధారపడి ఉంది.

సీసీ కెమెరాల ఉపయోగం ఎలా ఉంటుందో చాలా మందికి ఈ వీడియో చూశాక అర్థమవుతుంది.ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా సీసీ పుటేజ్ వలన నిర్దోషులను రక్షించవచ్చు, దోషులను శిక్షించవచ్చు. అయితే సంఘటన జరిగిన ప్రతిసారీ చూసినవారు ఉండకపోవచ్చు. ఇటువంటి సమయంలో సీసీ పుటేజ్ పనికొస్తుంది అని చెప్పడానికి ఈ వీడియోనే తార్కాణం. హైదరబాద్ లోని ఈసీఐఎల్ క్రాస్ రోడ్ లో ఒక వ్యక్తి లోడ్ లారీ ముందు పడిపోయి మరణించాడు. అదే రోడ్ పై ప్రయాణిస్తున్న వారంతా అది ప్రమాదంగా భావించి పోలీసులకు ఫోన్ కొట్టారు. పోలీసులు వచ్చి లారీను సీజ్ చేసి డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

మృతి చెందిన వ్యక్తి కుషాయి గూడకు చెందిన వ్యక్తి అని, అతడు టెంట్ హౌజ్ లో పనిచేస్తాడని, అతడి పేరు మధుసూదనరావు అని  సమాచారం. అయితే ఆ తర్వాత ఈసీఐఎల్ క్రాస్ రోడ్ లో ఉంచిన సీసీ పుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులో మధుసూదనరావు, రోడ్ దాతుతుండగా ఈ సంఘటన జరగలేదు, కావాలనే అతడు లారీ కింద పడినట్లుగా పుటేజ్ లో క్లియర్ గా ఉంది. మరి ఈ విషయంలో పోలీసులు, న్యాయస్థానం లారీ డ్రైవర్ కు ఎలా న్యాయం చేస్తారో? చూడాలి మరి.

Watch Video ( CC footage):

Comments

comments

Share this post

scroll to top