బాలీవుడ్ సుందరి ప్రెగ్నెంట్ నిజమేనా .??

బాలీవుడ్ సుందరి ప్రియాంక తన అందం అభినయంతో హాలీవుడ్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిత్యం ఎదో ఒక రూమర్స్ తో వార్తల్లో నిలుస్తుంది. ఆమెని ఏదో ఓ వివాదం వెంటాడుతునే ఉంటుంది. ఆ పాత రూమర్స్ అన్ని ఓ ఎత్తయితే ఇప్పుడు వచ్చిన రూమర్ ప్రియాంక ఇమెజ్ ని డ్యామేజ్ ని చేసేదిగా ఉంది. ఆ రూమర్ ఎంటంటే ప్రియాంక గర్భవతి అంటూ ప్రచారం మొదలైపోయింది.

ప్రియాంకపై వచ్చిన ఈవార్తలని ఆమె తల్లి మధు చోప్రా ఖండించింది. అలాంటిది ఏమి లేదని వివరణ ఇచ్చింది ప్రియాంక తల్లి. ఈ వార్త బయటికి రావడానికి కారణం ఏమంటే గతేడాది డిసెంబర్ లో ప్రియాంక తన బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలుసు. అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ప్రియాంక కడుపు పెద్దగా కనిపించింది. అంతే ప్రియాంక గర్భవతి అంటూ వార్తలు సృష్టించేశారు. అయితే ఆ ఫోటోలపై ప్రియాంక ఎలాంటి క్లారీటి ఇవ్వలేదు. దింతో ఆ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి.

కెమేరాలో ఫోటోలు సరిగా రాకపోవడం వల్లనే ప్రియాంక అనా కన్పించిందని ఆమె తల్లి క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక ధరించిన దుస్తులు బాగానే ఉన్న కెమెరాలో ఏదో లోపం వల్లనే అలా కన్పించిందని తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చింది. అయితే అందరు అక్కడితో సైలెంట్ అయ్యారు. మళ్లీ కోన్ని రోజుల తర్వాత ప్రియాంక చోప్రా ముంబైలోని ఓ హాస్పిటల్ లో కనిపించింది. దింతో మళ్లీ అందరికి అనుమానం వచ్చి ఆమెని వివరణ అడిగే ప్రయత్నం చేసింది మీడియా. ప్రియాంక ఈ విషయంపై మాట్లాడకుండా హాస్పిటల్ నుంచి సీక్రెట్ గా వెళ్లిపోయిందట. దీనితో ప్రియాంక నిజంగానే గర్భవతి అంటూ మళ్లీ పుకార్లు పుట్టుకొచ్చాయి.

అసలు ప్రియాంక హస్పిటల్ వెళ్లాళ్సిన అవసరం ఎందుకొచ్చిందంటే ఆమె బంధువు ఒకరు చికిత్స పొందుతున్నారట. వారిని పరామర్శించడానికే ప్రియాంక ఆ ఆసుపత్రికి వెళ్లినట్లు తేలిసింది.
ఇలాంటి టైంలో మీడియాతో మాట్లాడితే బాగుండదని భావించిన ప్రియాంక సైలెంట్ గా వెళ్లిపోయిందని అంటున్నారు. దీనిని తెలుసుకోకుండా అడ్డగోలుగా ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం చేసి ఆమెకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా మీడియా ప్రచారం చేసిందని ఆమె తల్లి మధు చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.

 

Comments

comments

Share this post

scroll to top