“నేనే రాజు నేనే మంత్రి” కథ “తేజ” ది కాదట..? అసలు రచయిత ఎవరో తెలుసా..? టైటిల్స్ లో వేస్తామని..

అప్పుడెప్పుడో చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో హిట్స్‌ అందుకున్న దర్శకుడు తేజ.తన సినిమాల్లో హీరోలని మన పక్కింటి అబ్బాయిల్లా చూపించాడు.తేజా సినిమాలు అందరిని ఆకట్టుకోకపోయినా కొందరిని ముఖ్యంగా యూత్ ని బాగా ఆకర్శించాయి..కానీ ఒకే ధోరణిలో పోతున్న తేజ శైలి చివరకు యూత్ కూడా బోర్ కొట్టేసింది. తర్వాత తేజకు అనుకున్న స్థాయిలో విజయాలు లేవు.తేజా పనైపోయింది అనుకున్నవాళ్లు ఉన్నారు.సరిగ్గా అలాంటి టైంలో  రానా ని హీరోగా పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ అంటూ వచ్చాడు తేజా. ఈ సినిమాలోని పొలిటికల్‌ డైలాగ్స్‌, రానా నటన సినిమాపై మంచి అంచనాలే పెంచాయి.

వరుస అపజయాలతో సతమవుతున్న డైరక్టర్ తేజ “నేనే రాజు నేనే మంత్రి”  సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రేమ కథలతో మ్యాజిక్ చేసే ఈ డైరక్టర్ ఈ చిత్రంలో ప్రేమకు కొంచెం పాలిటిక్స్ జోడించి హిట్ కొట్టారు. సినిమాని బాగా తీశారని తేజ ఓ వైపు అభినందనలు అందుకుంటుంటే..  మరోవైపు విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. “నేనే రాజు నేనే మంత్రి” కథ తేజ రాయలేదని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కథను తిమ్మా రెడ్డి అనే ఒక రచయిత రాసారని, ఈ కథ స్క్రిప్ట్ రూపంలో మారే వరకు తేజతో అతను ట్రావెల్ అయినట్లు సమాచారం.సినిమా మొదలవ్వగానే తిమ్మా రెడ్డి ని తేజ పక్కన పెట్టడం మొదలు పెట్టారని, టైటిల్ కార్డు వేస్తామని చెప్పినప్పటికీ, ఆ మాటను తేజ తప్పారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిమ్మా రెడ్డి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ విషయంపై పోరాడేందుకు ముందుకు రాలేదని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top