రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?

అంటే ఇప్పటికి సరైన సమాధానం దొరకలేదు. ఒక్కోక్కరు ఒక్కో సమాధానం చెప్తూ అందరిని అయోమయానికి గురి చేస్తున్నారు.
భూగోళము ఎప్పుడూ ఒకేలా ఉండడం కష్టం. లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమండలంపై ఐదు ఖండాలు లేవు. పర్వతాలు పెరుగుతూ వచ్చాయి. నదులు, సముద్రాలు పొంగి గతులు మారుస్తున్నాయి. సముద్రాలు పొంగి పల్లెలవి, పట్టణాలను ముంచెత్తుతోంది. కాబట్టి రావణ లంక, శ్రీలంకకు అటో ఇటో తప్పకుండా ఉండవచ్చు.

ఒక నాడు రావణుని రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం… సాక్ష్యాలతో సహా లభించింది. రామ రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు శ్రీలంక ప్రాంతంలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. సముద్రం మధ్యలో అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న లంక ఇదే.. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.

రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.

మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని రావణుడు అపహరించుకు వెళ్లాడు… రావణ సంహారం తరువాత రాముడు అందులోనే అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..

శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక పరిశోధన బృందం నిర్ధారించింది.

లంకలో అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి.. తులసీదాస్‌ రాసిన రామచరితమానస్‌ ఒరిజినల్‌ ప్రతి ఒకటి చిత్రకూటంలో భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది.

శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది.. ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి భౌతిక శరీరమని చెప్తున్నారు..

రావణుడు.. రామాయణం… భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి. అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి.

పురాణ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో భాగంగా అప్పటి రావణ లంక ఇప్పటి శ్రీలంక ఒకటేనా అనే అనుమానాలకు కాస్త తెరపడిందనే చెప్పొచ్చు. ఇప్పటికి పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే లంక రహస్యం బయటపడనుంది.

Comments

comments

Share this post

scroll to top