సమంత – నాగ చైతన్యల పెళ్లి “అక్టోబర్ 6” న జరగడం డౌటేనా..? కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ ప్రేమజంట నాగచైతన్య, సమంతల వివాహం ఈ నెల అక్టోబర్‌ 6న గోవాలో వైభవంగా నిర్వహించేందుకు దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వివాహం కోసం అటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, ఇటు సమంత ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక ఇప్పుడు వేళ్లపై డేస్ కౌంట్ చేస్తోంది. వీరి పెళ్లి వేడుక ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు.. అక్టోబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో వీరి వివాహం జరిపేలా ప్లాన్ చేశారు. అంతా బానే ఉంది. రాజుగారి గది 2 సినిమాపై సీరియస్ కాన్సట్రేషన్ ఉన్నా సరే నాగ్ ఈ పెళ్లి ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం తగ్గడంలేదని చెబుతున్నారు. అంతా శుభకరం, శ్రీకరం అనుకుంటుండగా చైతూ, సామ్ పెళ్లికి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

సమంత తల్లి ఆరోగ్యస్థితి అంతగా బాగోలేదని వార్తలొస్తున్నాయి. ఆ విషయమై అందరూ చాలా బాధగా ఉన్నారని అంటున్నారు. మరి ఈమె ఆరోగ్యం కుదుటపడతుందా? లేక పరిస్థితి ఏమిటనే విషయం పై క్లారిటీ లేదంటున్నారు. ఈ విషయంలో సమంత కుటుంబం అంతా చాలా విచారంగా ఉన్నారని కూడా ఈ వార్త సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కాని, ఒకవేళ అది నిజం అయితే సమంత తల్లి పరిస్థితి భాగుండకపోతే పెళ్లి వాయిదా పడతుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. కాని నిజంగా సమంత తల్లి ఆరోగ్య రీత్యా అంతగా భాగోకపోయినా, ఆమెకు త్వరగా నయం అయ్యి, ఈ పెళ్లి అనుకున్న టైం కి జరగాలని అక్కినేని ఫాన్స్, సమంత ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే..

చైతూ సమంత ల ప్రేమ కథ మొత్తం మనకు తెలిసిందే. వీరి ప్రేమ నిశ్చితార్దానికి వచ్చే వరకు అందరి దృష్టి వీరిద్దరి తెరచాటు ప్రేమపైనే ఉండేది. ఎంతో వైభవంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కినేని అభిమానులకు ఈ ప్రేమ జంట అంటే ఎంతో అభిమానం. రెండు వేరు వేరు కులాలే కాదు మతాలు కూడా కావడంతో మొదట్లో ఆమోదం కాస్త కష్టమే అయింది. అయినా.. అది వ్యాపారం అయినా, జీవితం అయినా భారీ కేలిక్యులేషన్ లో ఉండే నాగ్.. సామ్, చైతూల జోడీకి ముడివేస్తే లెక్క బాగానే కుదురుతుందని భావించారట. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే లీడింగ్ హీరోయిన్ సమంత తమ ఇంటికి కోడలిగా అడుగుపెడితే వచ్చే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల విషయంలో నాగార్జున భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు.

ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్ నేపథ్యంలో వీరి పెళ్లి అటు క్రిస్టియన్, ఇటు హిందూ సాంప్రదాయంలో కూడా జరుపుతున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. ఇక సమంత కట్టుకోబోయే చీర నుంచి, పెళ్లి కార్డులో చైతూ అమ్మానాన్నలైన లక్ష్మి, నాగార్జునలు తమ ఇరు కుటుంబాల తరపున వైవిద్యంగా ఆహ్వానించడం వంటి విషయాలెన్నో ఇటీవల ప్రముఖ వార్తాంశాలయ్యాయి. అయితే పెళ్లి దగ్గర పడతున్న సమయంలో కుటుంబంలో విషాదమంటూ ఓ ఊహాగానం ప్రచారంలోకి రావడంతో తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతోంది.

Comments

comments

Share this post

scroll to top