“రానా” తో ఆ హీరోయిన్ డేటింగ్ లో ఉందా..? ఆమె ఎలాంటి రిప్లై ఇచ్చిందో తెలుసా.?

రాణా గురించి డేటింగ్ వార్తలు కొత్తమే కాదు. గతంలో బిపాసా బసుతో, ఆ తర్వాత త్రిషతో,  రాగిణి ద్వివేదితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ,రాణా డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమారంగంలో డేటింగ్ కి సంభందించిన వార్తలు సహజం..కాకపోతే కలిసి నటించిన,లేదంటే ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్ల గురించి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు గుప్పుమంటాయి..మరి రాణా,రకుల్ ఎప్పుడు కలిసి నటించింది లేదూ…మరి వీరిద్దరి మధ్య డేటింగ్ ఉన్నట్టు వార్తలు రావడం ఏంటి..దీనిపై రకుల్ స్పందించి ఏమందో తెలుసా..?


ఇప్పుడున్న హీరోలంతా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కేస్తున్నారు..తండ్రి పోస్టు కి ప్రమోషన్ కూడా తీసుకుంటున్నారు..తెలుగు ఇండస్ట్రీలో బ్యాచిలర్ గా ఉన్న హీరోలంటే ప్రభాస్,రాణాలే అని చెప్పాలి..ప్రభాస్ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలొస్తున్నాయి..కానీ అవి ఇంకా పట్టాలెక్కట్లేదు..రాణా గురించి మాత్రం డేటింగ్ వార్తలకు లెక్కేలేదు..తాజాగా రకుల్ తో డేట్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి..

అయితే ఈ వార్తలపై రకుల్ స్పందించారు..ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేశారు.నేను ఎప్పటినుండో ఈ వార్తలను వింటున్నాను..విని నవ్వుకోవడం తప్పఏం చేయలేను..ఎందుకంటే మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్..మాకిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు.అదేవిధంగా సినిమా షూటింగ్ల నిమిత్తం నా కుటుంబానికి దూరంగా  హైదరాబాద్లో ఉండాల్సోచ్చినప్పుడు  రాణా మరియు నా కామన్ ఫ్రెండ్సే నాకు తోడున్నారు.నాకున్న ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు సింగిల్స్ ఉన్నారు.దాంతో మమ్మల్ని లింక్ చేసి ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు తప్పఅందులో నిజంలేదు..అవి వట్టి పుకార్లే అని కొట్టిపారేసింది రకుల్..ఏమో  నిప్పులేనిదే పొగరాదు అంటారు..

Comments

comments

Share this post

scroll to top