నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

నెమ‌లి ఈక‌లు అంటే ఇష్టం ఉండనిది ఎవ‌రికి చెప్పండి. చిన్నారులు మొద‌లుకొని పెద్ద‌ల వ‌ర‌కు వాటిని ఇష్ట‌ప‌డ‌తారు. చిన్నారులు అయితే నెమ‌లి ఈక‌ల‌ను బుక్స్‌లో పెట్టుకుంటారు. చాలా మంది పెద్ద‌లు కూడా చిన్న‌ప్పుడు అలాగే చేసి ఉంటారు. ఈ క్ర‌మంలోనే నెమ‌లి ఈక‌ల‌ను అనేక వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు అదృష్టంగా భావిస్తారు. కేవ‌లం మ‌న దేశంలోనే కాదు, ఇంకా ఇత‌ర దేశాల్లోనూ నెమ‌లి ఈక‌ల‌ను అదృష్టంగా భావిస్తార‌ట‌. కొంద‌రైతే నెమ‌లి ఈక‌ల‌ను ఏకంగా ఇంట్లో పెట్టుకుంటార‌ట‌. అవును మ‌రి. అయితే అస‌లు అలా నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గ్రీకులు నెమ‌లిని పూజిస్తారు. దాన్ని వారు త‌మ దైవంగా భావిస్తారు. నెమ‌లి ఈక‌ల‌ను స్వ‌ర్గానికి చిహ్నంగా, వాటికి ఉండే క‌ళ్ల‌ను స్వ‌ర్గానికి ద్వారాలుగా వారు భావిస్తార‌ట‌. అందుకే వారు నెమ‌లి ఈక‌ల‌ను ఇండ్ల‌లో పెట్టుకుంటారు.

2. నెమ‌లి అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి స్వ‌రూప‌మ‌ని హిందువులు న‌మ్ముతారు. నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే స‌మ‌స్య‌ల‌న్నీ పోయి, ఆర్థికంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. డ‌బ్బు బాగా సంపాదిస్తార‌ని న‌మ్ముతారు. ల‌క్ష్మీ దేవి స్వ‌రూపం కనుక‌నే శ్రీ‌కృష్ణుడు త‌న నెత్తిన నెమ‌లి ఫించాన్ని ధ‌రిస్తాడు.

3. చైనా, జపాన్ వంటి దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లైతే నెమ‌లిని ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు, ఆత్మీయ‌తకు చిహ్నంగా భావిస్తార‌ట‌. అది అదృష్టాన్ని తెచ్చి పెడుతుంద‌ని వారు న‌మ్ముతారు. అందుకే వారు నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటారు.

4. నిష్క‌ల్మ‌ష‌త్వానికి, నిష్క‌ప‌టానికి నెమ‌లి చిహ్న‌మ‌ని బౌద్ధ మ‌త‌స్తులు భావిస్తారు. నెమలిని స్వ‌చ్ఛ‌మైన జీవిగా వారు చూస్తారు. అందుకే దాన్ని పూజిస్తే సుఖ సంతోషాలు తెచ్చి పెడుతుంద‌ని వారు న‌మ్ముతారు.

5. పున‌రుజ్జీవానికి, అమ‌ర‌త్వానికి, ఉత్తేజానికి చిహ్నంగా క్రైస్త‌వులు నెమ‌లిని భావిస్తారు. అందుకే వారు నెమలి ఈక‌ల‌ను పెట్టుకుంటారు. దీని వ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి క‌ష్టాలు, స‌మ‌స్య‌లు రావ‌ని వారి న‌మ్మ‌కం.

6. స్వ‌ర్గ ద్వారాల వ‌ద్ద ఉండే అంద‌మైన‌, శుచి అయిన ప‌క్షిగా నెమ‌లిని ముస్లింలు భావిస్తార‌ట‌. ఈ క్ర‌మంలో వారు కూడా నెమ‌లి ఈక‌ల‌ను ఇండ్ల‌లో పెట్టుకుని ఆరాధించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అంతెందుకు కొంద‌రు ముస్లింలు నెమ‌లి ఈక‌ల‌తో సాంబ్రాణి పొగ వేస్తారు క‌దా. అలా చేస్తే ఆ ప్రాంతంలో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ని, దాంతో అక్క‌డ ఉండే వారికి స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయ‌ని వారు అలా చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top