2 వేల కోట్లకు 22 వేల కోట్లు అని తప్పుడు లెక్కలు చూపారంట! కాగ్ రిపోర్ట్.

అర్థికంగా ఉన్నవారు..తమ గ్యాస్ సబ్సీడీని వదులుకోండి. మీ ప్లేస్ లో నిజమయిన నిరుపేదకు  ఆ సబ్సీడి అందుతుంది అంటూ…మోడీ రంగంలోకి దిగి మరీ చేసిన  GIVE IT UP అనే ప్రచారం మీకు గుర్తుందా? చాలా మంది దయాహృదయులు తమ తమ గ్యాస్ సబ్సిడీని కూడా వదులుకున్నారు కూడా…  ఇలా  ఆర్థికంగా ఉన్న వారు గ్యాస్ రాయితీని వదులుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి 22 వేల కోట్ల డబ్బు ఆదా అయ్యిందని గొప్పగా చెప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే అవ‌న్నీ కాకి లెక్క‌లేన‌ని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (Comptroller and Auditor General -CAG (కాగ్‌)) తేల్చి చెప్పింది.

 

lpg-save

 

ఈ మ‌ధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధ‌ర‌లు బాగా త‌గ్గ‌డం వ‌ల్లే దేశానికి వంట గ్యాస్ ప‌రంగా అంత ఆదాయం వ‌చ్చింద‌ని కాగ్ చెప్పింది. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వ స‌బ్సిడీ స్కీం, GiveItUP campaign ల ద్వారా ఆదా అయిన డ‌బ్బు కేవలం రూ.2వేల కోట్లేన‌ట‌. మిగ‌తా రూ.20 వేల కోట్లు ఎల్‌పీజీ ధ‌ర త‌గ్గ‌డం వ‌ల్ల వ‌చ్చిన ఆదాయ‌మేన‌ని కాగ్ త‌న లెక్క‌ల ద్వారా తేల్చి చెప్పింది.

గతేడాది స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ఇచ్చిన ఉప‌న్యాసాన్ని మీరే చూడండి. అందులో మోడీ త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ వంట గ్యాస్ స‌బ్సిడీ, GiveItUP campaign ల ద్వారానే అప్పటికి దేశానికి రూ.15వేల కోట్లు ఆదా అయ్యాయ‌ని చెప్పారు. ఇప్పుడేమో కాగ్ లెక్కలు ఇలా ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top