“బిగ్ బాస్ షో” లో బయటకి చూపించేది అంతా నిజమేనా..? మోసం చేస్తూ దొరికేసాడు అనడానికి ఇదే సాక్షం..!

సంచలనాత్మక షో బిగ్ బాస్ ఊహించని TRP తో దూసుకుపోతుంది .మొదటి ఎపిసోడ్ కే రికార్డు బ్రేక్ చేసే TRP ని రాబట్టింది .అలాగే రెండవ వారం మరింత TRP తో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది .అయితే ఈ రియాలిటీ షో లో జరుగుతున్నది అంతా రియల్ కాదేమో అనిపిస్తుంది .అందులో కొన్ని సడలింపులు ఉన్నట్లుంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఇంట్లో ఉన్నవారు ఫోన్ మాట్లాడకూడదు వాడకూడదు ఇది ఓకే ఇంతవరకు ఎవరిదగ్గర ఫోన్ చూడలేదు. మధ్య మద్యలో సెల్ఫీ తీసుకుంటున్న ఫోన్ లు ఎలాగూ టాస్క్ లోని భాగమే .

టీవి లేదు బయట వ్యక్తితో కనెక్షన్ లేదు .వంట ఇంట్లో వారే వండుకోవాలి .బాత్రుమ్స్ వారే శుభ్రం చేసుకోవాలి, అలాగే ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి .మరి బాత్రుమ్స్ నిజంగానే వారే శుభ్రం చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ బట్టలు మాత్రం వాళ్లు ఉతుక్కోవడం లేదు. ఎందుకంటే జ్యోతి వెళుతూ వెళుతూ ఒక బాంబ్ ప్రిన్స్ మీద వేసీ వెళ్ళింది .దాంతో ఇంటిలోని అందరి బట్టలు ప్రిన్స్ ఉతకాల్సి వచ్చింది. కానీ ఇంతవరకు ప్రిన్స్ బట్టలు ఉతకడం ఒక్కసారే చూశాము .తాను పనిష్మెంట్ సమయంలో అందరి బట్టలు ఉతికే ఫుటేజి ఎలాగూ మన దగ్గర లేదు మిగతావారు ఉతుక్కోవడం కుడా మనం చూడలేదు

అయితే కొన్ని ఫోటోస్ లలో మనం క్షున్నంగా పరిశీలించి చూస్తే వారివెనుకాల వాషింగ్ మెషిన్ కనిపిస్తుంది .అయితే ఎవరి బట్టలు వారే ఉతుక్కోవాలి అనే రూల్ ఉంది కదా, అందుకని ఎవరి బట్టలు వారే వాషింగ్ మెషీన్ లో వేసుకుంటారేమో అనుకోకండి ఎందుకంటే ప్రిన్స్ బాత్రుమ్ దగ్గర చేతితో బట్టలు పిండుతున్నట్లు ఆల్రెడీ మనకి చూపించారు .అయితే మరి ఇంట్లో వాషింగ్ మెషీన్ ఎందుకు..? ఇక్కడ వాషింగ్ మెషీన్ ఉండటం తప్పుకాదు .అయితే ఇంట్లో ఎవరిబట్టలు వారే ఉతుక్కుంటారని జనాలకు చెప్పడం ఎందుకు?

 

Comments

comments

Share this post

scroll to top