“రామ్ చరణ్” కు చెల్లిగా నటించిన ఆ షార్ట్ ఫిలిం హీరోయిన్ ని “దేవిశ్రీప్రసాద్” పెళ్లి చేసుకోబోతున్నాడంట.?

దేవి సినీ ఇండస్ట్రీ లో తన మ్యూజిక్ తో యూత్ ని తనవైపు తిప్పుకున్నాడు. తెలుగు లోనే కాదు తమిళ, కన్నడ మళయాళీ అన్న తేడా లేకుండా సౌత్ ఇండియా భాషలన్నింటిలోనూ తనదైన జోష్ ఫుల్ ఎంటర్టయిన్మెంట్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. సినీ ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబల్ బాచిలర్ లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరని సినీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దీంతో హీరో ప్రభాస్ పెళ్లి ఎంత హాట్ టాపిక్కో దేవిశ్రీ పెళ్లి కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ ఆసక్తికర విషయమే. ముఖ్యంగా డీఎస్పీ మ్యూజిక్ అంటే చెవులు కోసుకునే నేటితరం ప్రేక్షకులు, వీరాభిమానులు అయితే పెళ్లి శుభవార్త కోసం తెగ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

దేవిశ్రీ తో ఛార్మి సన్నిహితంగా ఉన్నారంటూ వార్తలు సైతం వచ్చాయి. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అని కూడా అనుకున్నవాళ్లున్నారు. తర్వాత దేవి చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావడం తో ఆ గాసిప్స్ చల్లారాయి. ఐతే మళ్లీ కొత్త టాపిక్ తో దేవిశ్రీపై కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఇప్పుడు ఫిల్మ్ నగర్ యావత్తూ ఈ అంశంపైనే చర్చించుకుంటోంది. ఈ కొత్త విషయం ఎంత వరకు ప్రాక్టికల్ గా నిజమవుతుందో తెలియదు కాని హడావుడి మాత్రం మామూలుగా జరగడంలేదు.

రాంచరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం సినిమాకు డీఎస్పీనే మ్యూజిక్ చేస్తున్నాడు. ఆ సినిమాలో రాంచరణ్ చెల్లిగా నటిస్తున్న పూజితను దేవిశ్రీ పెళ్లాడబోతున్నాడనేది తాజాగా నడుస్తున్న గాసిప్. అయితే ఈ సినిమా నిర్మాణ క్రమంలో ఆమెపై మనసు పడ్డాడా? లేక అంతకుముందే వారివురి మధ్య అనుబంధం ఉండబట్టే రంగస్థలంలో కీలకమైన రోల్ ఇచ్చారా? ఇప్పటికయితే బయటికి రాలేదు. అసలు ఆ వార్తలో నిజా నిజాలేమిటో కూడా తెలియాలంటే కొద్ది టైం ఆగాల్సిందే. ఏది ఏమయినా ఈ సంవత్సరం ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దేవిశ్రీ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం మాత్రం ఖాయమంటున్నారు. మరి ఆయనగారి పెళ్లి ఎవరితో అవుతుందో చూడాలి..

Comments

comments

Share this post

scroll to top