ప్రేమఖైధి సినిమాతో పరిచయం అయిన అమలాపాల్ ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది..పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడం..భర్తతో మనస్పర్దలు విడాకులు..ఆ తర్వాత మళ్లీ సినిమా అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయడం మనకు తెలిసిందే..అయితే ఇప్పుడు అమలాపాల్ తెగ వణికిపోతుంది..చలికాలం కదండి మేం కూడా వణుకుతున్నాం అంటారు..అమలాపాల్ వణుక్కు కారణం చలి కాదండి..మళయాళి నటుడు ఫవాద్..అతనికి ,అమలాకి ఏంటి సంభందం అనుకుంటున్నారా..
రాజా రాణి ఫేం నజ్రియా నజీమ్ తనదైన నటనతో ఆకట్టుకుంది..పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది..ఆమె భర్త నే ఫవాద్ ఆయన కూడా ప్రముఖ మళయాళి నటుడే..అయితే ఈయన ఈ మధ్య తప్పుడు ధృవపత్రాలు సమర్పించిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే..బెయిల్ పై వచ్చాడు అది వేరే విషయం.సరిగ్గా ఇప్పుడు అలాంటి కేసులో ఇరుక్కుంటాననే భయం పట్టుకుంది అమలాపాల్ కి.. ఆమె కూడా టాక్స్ ను ఎగ్గొట్టేందుకు తన లగ్జరీ కారును పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న అమలాపాల్ కు ఇప్పుడు అరెస్ట్ అయితే పెద్ద దెబ్బే తగులుతుంది. అందుకే ముందస్తు బెయిల్ కోసం కోర్టు లో పిటిషన్ వేసింది..బెయిల్ కనుక మంజూరు కాకపోతే అమలాపాల్ అరెస్ట్ అవ్వడం మాత్రం ఖాయం…ఈ కేసులు అంత తీవ్రమైనవి కాకపోయినా అమలా మాత్రం తెగ భయపడుతుంది..వాస్తవమే కదా ఇప్పుడు కనుక అరెస్ట్ అయితే వచ్చే అరకొర సినిమా అవకాశాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది..తత్ఫలితంగా కెెరీర్ పరంగా ,ఫైనాన్షియల్ గా కూడా బాగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది..