ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు అరుదైన వ్యాధి వచ్చిందనే విషయం మనకు తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈయన ఆరోగ్యానికి సంబంధించి పలు పుకార్లు రాగా వాటిని ఇర్ఫాన్‌ఖాన్ కొట్టి పారేశారు. తాను కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నానని, తనకు ఉన్న వ్యాధి ఏమిటో స్వయంగా తానే తెలియజేస్తానని చెప్పారు. అయితే అన్నట్లుగానే ఆయన తన వ్యాధి ఏంటో తాజాగా చెప్పేశారు. ఇర్ఫాన్‌ఖాన్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ (Neuroendocrine Tumor) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా ఆయనే వెల్లడించారు. అయితే ఇంతకీ అసలు ఈ వ్యాధి ఏంటి ? ఎందుకు వస్తుంది ? లక్షణాలు ఏముంటాయి ? దీనికి చికిత్స ఉంటుందా, ఉండదా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
న్యూరో అనగానే సాధారణంగా ఎవరికైనా మెదడు సంబంధమైంది అనే విషయం గుర్తుకు వస్తుంది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది కరెక్ట్ కాదు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే న్యూరో అంటే మెదడుకు సంబంధినది అనే అర్థం వస్తుంది. ఇక ఇర్ఫాన్‌ఖాన్‌కు వచ్చింది Neuroendocrine Tumor అయినా ఇది మెదడు సంబంధమైంది కాదు. మరేమిటంటే…
Neuroendocrine Tumor అనే వ్యాధి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం Neuroendocrine system గురించి కొంత తెలుసుకోవాలి. ఈ వ్యవస్థకు చెందిన కణాలు శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ నుంచి సిగ్నల్స్ అందుకుని శరీరానికి అవసరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్లు మన శరీరంలో వివిధ జీవక్రియలు సజావుగా సాగేందుకు పనికొస్తాయి. ఇక Neuroendocrine Tumor అనేది ముందు చెప్పిన ఆ Neuroendocrine system కణాలకు వస్తుంది. అక్కడి నుంచే మొదటగా ఇది ప్రారంభమవుతుంది. తరువాత శరీరం మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. అయితే Neuroendocrine Tumor వచ్చిన ఆరంభంలో ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు. కానీ వ్యాధి ముదురుతున్నకొద్దీ పలు లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేమిటంటే…
Neuroendocrine Tumor లక్షణాలు…
1. కడుపులో లేద గుద భాగంలో అసౌకర్యంగా, నొప్పిగా అనిపించడం
2. వికారం, వాంతులు
3. డయేరియా
4. విరేచనాల్లో రక్తం పడుతుండడం, గుద భాగం నుంచి రక్తం పడడం
5. రక్తహీనత, అలసట
6. అజీర్ణం, అసిడిటీ
7. ఛాతిలో నొప్పి, గ్యాస్ సమస్య, జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడడం
8. బరువు తగ్గడం
9. చిన్నపేగుల్లో అడ్డంకులు ఏర్పడి కడుపులో నొప్పి రావడం
10. పచ్చకామెర్లు
Neuroendocrine Tumor వ్యాధికి చికిత్స లేదా అంటే.. ఉంది. కాకపోతే వ్యాధి ఆరంభంలో ఉంటే సులభంగా తగ్గించవచ్చు. అదే ముదిరి క్యాన్సర్‌గా మారితే చికిత్స అసాధ్యమవుతుంది. అలాంటి వారు బతకడం కష్టమే. ఇక ఈ వ్యాధి వల్ల కలిగే లక్షణాలను కొన్ని సంవత్సరాల పాటు అదుపు చేసేందుకు వీలు కలుగుతుంది. అందుకు రోగులు సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ చేయించుకోవాలి. అయితే వ్యాధి బాగా ముదిరితే మాత్రం చేసేదేం ఉండదు. ఏది ఏమైనా ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన ఈ వ్యాధి అరుదైందే అయినా దాన్నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.