టైటిల్ కి, మ్యాటర్ కి సంబంధం లేని యూట్యూబ్ వీడియోస్ ..! కుదిరితే మారండి లేదా కొంచెం కూడా ఆలోచించకుండా చచ్చిపోండి!

హెడ్డింగ్ 1 :
“రాత్రుళ్ళు కిందవి చూసుకుని పీక్కుని లెక్కపెట్టుకుంటున్న కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు”

లోపల వార్త : పాపం కొందరు YouTube ఛానెల్స్ వాళ్ళ కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదు.. క్రింద చాలామంది రాసే నెగటివ్ కామెంట్స్ ని రోజూ పీక్కుంటూ ఉండడం పెద్ద పనైపోయింది అని, Dislikes ని లెక్కపెట్టుకుంటూ క్రింద పడి దొర్లి దొర్లి ఏడుస్తూ ఉన్నారు..

హెడ్డింగ్ 2 : 
“మా అమ్మల్ని, అక్కల్ని, ఇంట్లో అందర్నీ సిగ్గులేకుండా అలా చూస్తాం అంటున్న కొందరు YouTube & Websites వాళ్ళు”

లోపల వార్త : మాకు నచ్చకపోతే, అబద్దాలు పెట్టి, సొల్లు కబుర్లతో పరువు తియ్యడానికి మా ఇంట్లో ఆడవాళ్ళని, మగవాళ్ళని కూడా క్షమించం..పాపులర్ అవ్వడానికి సిగ్గులేకుండా ఎంతటి నీచానికైనా వెనకాడం అంటున్న కొందరు YouTube & websites వాళ్ళు..వ్యూస్ పెంచుకోవడం మాత్రమే తమ లక్ష్యం అని అందుకోసం ఎంత కిందకైనా దిగజారుతాం అని, ఇదే సమన్యాయం అంటున్నారు వాళ్ళు..

హెడ్డింగ్ 3 : 
” మా భార్యలు అతనితో అలా అక్కడికి వెళ్లినా పర్వాలేదు అంటున్న కొందరు YouTube & Websites వాళ్ళు”

లోపల వార్త : మా భార్యలు వారి తండ్రితో కానీ, అన్నలతో కానీ సినిమాలకు, యాత్రలకు వెళ్తే, మాకేమీ పర్వాలేదు..మేము హోటల్ ఫుడ్ తో బతికేస్తాం అంటున్న కొందరు త్యాగమూర్తులైన YouTube & Websites వాళ్ళు..

అసలు వార్తలకంటే హెడ్డింగ్స్ బాగున్నాయి కదా!!

ఈపోస్ట్ పెట్టేముందు నేను నరకయాతన పడ్డాను..వ్యక్తిగతంగా నాకు ఏమాత్రం ఇష్టంలేని, భరించరాని భాషను వాడాల్సివచ్చింది..అందరిలాగే ఈ వెధవలను తిట్టడానికి స్త్రీ మూర్తులను అడ్డం పెట్టుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను..దయచేసి క్షమించండి అమ్మా.. ఇది ఎందుకు పెట్టానో మళ్లీ మీకు చెప్పాల్సిన పని లేదనుకుంటా!..

సంస్కారం, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, చీము, నెత్తురు లేని కొందరు క్రాస్ బ్రీడ్ జంతుమానవులు, పాపులర్ అవ్వడం కోసం చేస్తున్న ఆరాచకపు హెడ్డింగులు చూసి కడుపు రగిలిపోతుంది..
వారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ నాదొక్కటే విన్నపం :
కుదిరితే మారండి లేదా కొంచెం కూడా ఆలోచించకుండా చచ్చిపోండి..మీవల్ల దేశానికి, మీ కుటుంబానికి కూడా ఏమాత్రం ఉపయోగం లేదు…

ఇట్లు
మిమ్మల్ని నేరుగా చంపితే నేరం అని ఆగిపోతూ, క్షమించడానికి కూడా మీరు అర్హులు కాదని భావిస్తూ…
...లక్ష్మీ భూపాల

ఇది ఈ మధ్య ఎఫ్బీలో పెట్టిన పోస్టు.. పెట్టింది ఎవరనుకున్నారు తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు పవర్ఫుల్ డైలాగ్స్ రాసిన మాటల రచయిత లక్ష్మీ భూపాల గారూ…ఈ పోస్టు చూడకముందునుండి నా ఆలోచనా అదే.. పెట్టిన టైటిల్ కి లోపల మ్యాటర్ కి సంభందం ఉండదు..అంతేకాదు మ్యాటర్ ఏదైనప్పటీకి ఎదుటి వారిని అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏవగింపు కలిగించే టైటిల్సే ఎక్కువ..అంటే ఒక రకంగా అలా పెడితేనే జనాలు చూస్తారు అని ఫిక్సయిపోయారు..యూట్యూబ్ అనేకాదు చాలా సైట్స్ కూడా అలాగే ఉన్నాయి.టైటిల్ కి మ్యాటర్ కి సంభందం లేకుండా…ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నిన్న మొన్న మోహన్ బాబు కి సంభందించిన ఒక వీడియో యూట్యూబ్ లో బాగా పాపులర్ అయింది..ఎంతలా పాపులర్ అయిందంటే ఒక రోజులో లక్షాయాబైవేల వ్యూస్..టైటిల్ ఏంటంటే ఇంట్లో మోహన్ బాబు నిజస్వరూపం ఇదీ అంట… దానికి వాళ్లు పెట్టిన ఇమేజ్,పెట్టిన టైటిల్ ,చెప్పిన మ్యాటర్ ఒకదానికొకటి పొంతనలేదు…అసలు ఈ ఒక వీడియోనే కాదు ప్రతి వీడియో విషయంలో ఇదే బాపతు…ఇప్పటికీ యూ ట్యూబ్ ని నువ్ గొట్టం అదీ ఇదీ అంటూ హేళన చేస్తున్నారు.ఇకపై బూతు గొట్టం అని పిలిచినా సందేహం లేదు..చాలా తిట్టాలనుంది..కానీ పైన లక్ష్మీ భూపాల గారు మర్యాదగా తిట్టిన తిట్లు సరిపోతాయనుకుంటున్నా..

watch video here:

Comments

comments

Share this post

scroll to top