92 పైస‌ల‌తో రూ.10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్.!!ప్రయానం చేసేటప్పుడు మిస్ కావొద్దు.

ఐఆర్‌సీటీసీ… దేశంలోని ప్ర‌యాణికుల‌కు రైల్వే టిక్కెట్ల‌ను బుక్ చేసుకునేందుకు సేవ‌లు అందిస్తున్న సంస్థ ఇది. ఇప్పుడిందులో కేవ‌లం రైల్వే టిక్కెట్లు మాత్ర‌మే కాదు, ప్రయాణికుల‌కు అవ‌స‌ర‌మైన ఇంకా ఇత‌ర అనేక సేవ‌లు కూడా ల‌భిస్తున్నాయి. అది వేరే విషయం. అయితే గ‌త రెండు రోజుల క్రితం జ‌రిగిన ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్ర‌మాదం గురించి తెలుసుగా..! ఇప్పుడు ఆ ప్ర‌మాదానికి, ఐఆర్‌సీటీసీకి సంబంధం ఏమిటంటారా..? స‌ంబంధం ఉంది..! అయితే అది ప్ర‌మాదం గురించి మాత్రం కాదు, ఇన్సూరెన్స్ గురించి..! అవును, మీరు వింటున్న‌ది క‌రెక్టే..! అయినా ఏమీ అర్థం కాలేదా… అయితే ఆ విష‌యం గురించి కింద పూర్తిగా చ‌ద‌వండి..!

irctc-insurance
ఏమీ లేదండీ… గ‌త రెండు రోజుల క్రితం ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదం జ‌రిగిందిగా. అందులో 120 మందికి పైగా ప్ర‌యాణికులు చ‌నిపోయారు. అంత‌కు రెట్టింపు సంఖ్య‌లో మందికి తీవ్ర గాయాల‌య్యాయి. ఇంకొంద‌రికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. అయితే ఆ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారికి, గాయాలైన వారికి కేంద్రం కొన్ని ల‌క్ష‌ల రూపాయల‌ను ఎక్స్‌గ్రేషియాగా ప్ర‌కటించింది. అయితే వాటితోపాటు ప‌లువురు ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ నుంచి ఇన్సూరెన్స్ అంద‌నుంది. అస‌లే, అంత‌మంది చ‌నిపోయి, చాలా మందికి గాయాలై తీవ్ర విషాదంలో ఉంటే ఇప్పుడీ ఇన్సూరెన్స్ గోల ఏమిటి అని అనుకుంటున్నారా..? అయినా త‌ప్ప‌దు. ఎందుకంటే చాలా ముఖ్య‌మైన విష‌యం ఇది. చ‌నిపోయిన వ్య‌క్తులు ఎలాగూ తిరిగి రారు. కానీ వారి వ‌ల్ల బ‌తికి ఉన్న వారికి ఎంతో కొంత మేలైతే జ‌రుగుతుంది క‌దా. ఏదో ఒక ఆస‌రా ఉంటుంది కదా. అందుకైనా అస‌లు విష‌యం తెలుసుకోవాల్సిందే.

అయితే ఇక విష‌యానికి వ‌స్తే స‌ద‌రు రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ప‌లువురికి, గాయాలైన వారిలో కొంద‌రికి ఐఆర్‌సీటీసీ నుంచి ఇన్సూరెన్స్ అంద‌నుంద‌ని చెప్పాం క‌దా. మ‌రి అంద‌రు ప్ర‌యాణికుల‌కు అది ఎందుకు వ‌ర్తించ‌దంటే వారు ఐఆర్‌సీటీసీలో టిక్కెట్లు బుక్ చేసుకోలేదు కాబ‌ట్టి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఐఆర్‌సీటీసీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 1 నుంచి ఓ వినూత్న‌మైన ఆఫ‌ర్‌ను త‌న వినియోగ‌దారుల కోసం ప్ర‌వేశ‌పెట్టింది. అదేమిటంటే… దేశంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వెళ్లే ఏ రైలులో అయినా (ఎంఎంటీఎస్ త‌ప్ప‌) ప్ర‌యాణికులు ఏ క్లాస్‌కు చెందిన టిక్కెట్‌నైనా బుక్ చేసుకుంటే ఆ స‌మ‌యంలో కేవ‌లం 92 పైస‌లు అద‌నంగా చెల్లిస్తే చాలు వారికి రూ.10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ క‌వ‌రేజిని అందిస్తోంది. ప్ర‌యాణికులు తాము వెళ్లాల్సిన ట్రైన్‌ను ఎంపిక చేసుకున్నాక వ‌చ్చే మ‌రో స్క్రీన్‌లో ప్యాసింజ‌ర్ స‌మాచారంతోపాటు అక్క‌డే కింద ఉండే ట్రావెల్ ఇన్సూరెన్స్ సెక్ష‌న్‌లో Yes అన‌బ‌డే ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే చాలు. టిక్కెట్ల‌క‌య్యే డ‌బ్బుకు మ‌రో 92 పైస‌లు అద‌నంగా క‌లుస్తాయి. ఆ రైలులో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ఆ ఇన్సూరెన్స్ వ‌ర్తిస్తుంది. దీంతో ఆ రైలులో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ప్ర‌యాణికుల‌కు ఏమైనా జ‌రిగితే అప్పుడు ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. మ‌ర‌ణం లేదా పూర్తిగా అంగ‌వైక‌ల్యం సంభ‌విస్తే రూ.10 ల‌క్ష‌లు, పాక్షిక అంగ‌వైక‌ల్యం అయితే రూ.7.50 ల‌క్ష‌లు, స్వ‌ల్పంగా గాయాలైతే రూ.2 ల‌క్ష‌లు, ఏమీ జ‌ర‌గ‌కున్నా ప్రయాణ ఖ‌ర్చుల కింద రూ.10వేల వ‌ర‌కు ఇన్సూరెన్స్ డ‌బ్బులు వస్తాయి. ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఇలా ఇన్సూరెన్స్ తీసుకున్న వారు మొత్తం 126 మంది మాత్ర‌మే ఉన్నారు. అందులో 78 మందికి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌నుంది.

ఇక‌పై ఎప్పుడైనా మీరు ఐఆర్‌సీటీసీలో ట్రైన్ టిక్కెట్ బుక్ చేస్తే ఇన్సూరెన్స్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి. అందుక‌య్యే ఖ‌ర్చు కూడా కేవ‌లం 92 పైస‌లే క‌దా. వాటి కోసం చూసుకుంటే ఇప్పుడు చూశారు క‌దా, ఎంత‌టి ఘోర ప్ర‌మాదం జ‌రిగిందో. క‌నుక రైలులో ప్ర‌యాణించాల‌నుకుంటే ఇన్సూరెన్స్ ఆప్ష‌న్ మాత్రం మ‌రువ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top